Ad Code

Responsive Advertisement

రైలు కిటికీలకు ఇనుప కడ్డీలు నిలువుగా కాకుండా అడ్డంగానే ఎందుకు బిగిస్తారు?

  1. . ప్రధానమైన కారణం- సౌలభ్యత. నిలువు కడ్డీలు ఉండే ఇంటి కటాంజనం(గ్రిల్) లోనుంచి ఏదైనా వస్తువు తీసుకోవడానికి,ఇవ్వడానికి ప్రయత్నించండి. కష్టంగా తోస్తుంది. అదే అడ్డంగా ఉండే పద్దతిలో సులువు అవుతుంది.ముఖ్యంగా రైళ్ళలో తినుబండారాలు,కాఫీ కప్పులు ఇలాంటివి అడ్డం కడ్డీ ల లో చాకచక్యంగా సరఫరా చేయొచ్చు అనుకుంటాను.
  2. కంటికి ఇంపుగా ఉండటం. బహుశా నిలువు కడ్డీలు, ఏదో నిర్భంధం అన్న ఫీలింగ్ మనసులో కలిగిస్తాయి. జైలు చువ్వలు, ఇంటి ఫెన్సింగ్ ,పక్షి పంజరం,జంతువుల నుంచే డబ్బాలు ఇవన్నీ నిలువు కడ్డీ లే మరి.
  3. చాలా వ్యాసాల్లో, వంచవలసి వస్తే, అడ్డం చువ్వలు ,నిలువు వాటికంటే సులభంగా వంగుతాయని నిపుణులు చెప్పటం చూసాను. బహుశా ప్రమాదాల దృష్ట్యా సులభంగా వంగే అడ్డ కడ్డీ లే, వెల్డింగ్ కి లొంగుతాయేమో ఇంజినీరు బాబులే చెప్పాలి.
  4. మిగతా అన్నిటి లాగే ఇవి కూడా మొదటినుండి ఇలా లేవు . క్రమ పరిణామం పొందాయి. అందుకే వాడక లో ,అమర్చటం లో, అలానే మైంటైన్ చేయడంలో సులువు ఉండే ఉంటుంది. అలాగే, ఎమర్జన్సీ కిటికీల లో, తీసే వీలు లేని కిటికీలలో నిలువు చువ్వలు నేను గమనించాను. సాధారణ తరగతి,స్లీపర్ బోగీల్లో మాత్రమె ఇవి మీకు కనిపిస్తాయి.

ఇక చివరిగా ఒకమాట .దొంగతనాలకు ఇవి నిజానికి అనుకూలం .ఎలా అంటారా,తలుపు పక్కని ఉండే కిటికీ ఎప్పుడైనా చూసారా?


ఇలా ఎర్ర బాక్స్ లో ఉన్న కిటికీ లకి మిగతా కిటికీ ల కంటే తక్కువ దూరంలో కడ్డీ లు ఉంటాయి. తలుపు లోంచి దిగుతూ పక్కని కూర్చుని ఉన్న వారి వస్తువులు సులభంగా లాగేసే, తస్కరుల నుంచి రక్షణ కోసం ,ఇవి అలా ఉంటాయి. తలుపుల కున్న కడ్డీలు కూడా అంతే. సులభంగా చేయి పెట్టి, తలుపు లాగే అవకాశం లేకుండా, కట్టుదిట్టం కోసం అలా ఉంచారన్న మాట.

అసలు కడ్డీలే ఎందుకు, అంటే, తల బయట పెట్టి ప్రమాదం కొని తెచ్చుకోకుండా, కిటికీ లోంచి చిన్న పిల్లలు,విలువైన వస్తువులు పడిపోకుండా ,బయటనుండి ఎగిరి వచ్చే రాళ్ళు, ఇంకేదైనా లోనికి రాకుండా, జాగ్రత్త కోసం.

Post a Comment

0 Comments

Close Menu