Ad Code

Responsive Advertisement

మరణశిక్ష తర్వాత న్యాయమూర్తులు పెన్ నిబ్ ఎందుకు విరగకొడతారు?

 

మరణశిక్ష విధించిన తర్వాత నిబ్ పగలగొట్టే ఆచారం బ్రిటిష్ పాలన నుండి భారతీయ న్యాయమూర్తులు అనుసరిస్తున్నారు.

నిబ్‌ను విచ్ఛిన్నం చేయాలి అనేది రూల్ ఏమీ కాదు. అదొక సంప్రదాయం మాత్రమే. ప్రతీకాత్మక చర్య అనవచ్చు. ఎందుకంటే, IPC, CrPC చట్టాలలో మరణశిక్ష విధించిన తర్వాత న్యాయమూర్తి పెన్నును పగలగొట్టాలని ఎక్కడా పేర్కొనబడలేదు.

ఇవీ కారణాలు/సిద్ధాంతాలు:

  • ఒకసారి సంతకం చేసిన తర్వాత, తీర్పును సమీక్షించే లేదా రద్దు చేసే అధికారం న్యాయమూర్తులకు ఉండదు. కాబట్టి న్యాయమూర్తి తన స్వంత తీర్పును సమీక్షించుకోవాలని ఆలోచించకుండా ఉండేందుకు నిబ్ విరగగొట్టబడుతుంది.
  • ఆ పెన్, ఒక వ్యక్తి జీవితానికి ముగింపు పలుకుతుంది. అలాంటి దురదృష్టకరమైన కలాన్ని మరోసారి వాడకూడదు అనే ఉద్దేశం కూడా దీని వెనక ఉంది. రక్తం రుచి చూసిన పెన్నుగా పరిగణించి, మరో ప్రాణం తీయటానికి ఆస్కారం ఇవ్వకూడదనే ఉద్దేశం ఉంటుంది.
  • మరణశిక్ష విధించడం అనేది కష్టతరమైన తీర్పే. విధించాక, ఆ తీర్పు వల్ల అసంతృప్తి గానీ, పశ్చాత్తాపం గానీ కలగకూడదనే భావన న్యాయమూర్తికి కలిగే విధంగా ఈ ఆచారాన్ని అలానే ఉంచేశారు.

Post a Comment

0 Comments

Close Menu