తృప్తికరమైన తిండిగానీ, ఆహారంగానీ తీసుకున్న తర్వాత మగతనిద్రవస్తుంది.కంటిరెప్పలు బరువెక్కి,మూసుకొనిపోతాయి.బాహ్య ప్రపంచం లీలగా
జ్ఞాపకమొస్తూ,మెల్లిగానిద్రలోనికిజారుకుంటాం. రుచికరమైన భోజనంలోనిరసాయనాలవల్ల మనకిలా కలుగుతుందా? లేక మరో కారణం వుండవచ్చా? ఈఅనుభూతి అందరూ చవిచూసినవారే. శాస్త్ర రీత్యా దీనికి కారణాలను వెదుకుదాం,మెదడులోని హైపోథాల్ మస్ ప్రాంతంలోవున్న నిద్ర కేంద్రాలు శరీరంలోని కండరాలను విశ్రాంతి తీసుకోమని ఉత్తర్వులు జారీ చేయగానే మనకుమగతనిద్ర వస్తుంది. ఎప్పుడైతే కండరాలు విశ్రాంతి తీసుకుంటాయో, కను
రెప్పలు బరువెక్కుతాయి. తల మన స్వాధీనంలో వుండదు. కూర్చోవటమే కష్టమౌతుంది. మెదడులోని హైపోథాలమస్ లోవున్న 'బయోలాజికల్ క్లాక్'మామూలు నిద్రవస్తున్నప్పుడు వై పనిని ప్రోత్సహిస్తుంది. ఎక్కువ శ్రమవల్ల శరీరంలోని కండరాలు అలసట చెందినప్పుడు కూడా పై విధంగా జరుగుతుంది.హైపోథాలమస్ లో మెలాటోనిన్ అనే చిన్న ప్రోటీను వుత్పత్తి కావడంవల్లకూడా మగత నిద్ర రావచ్చు. ఎక్కువ ఆక్సిజన్ ను, న్యూట్రిషియన్లను కండ
రాలుతీసికోవటంతో,మెదడుకుతగినంతఆక్సిజన్ , న్యూట్రిషియన్లు అందవు.
దీనివల్ల నిద్రరావటం మొదలవుతుంది. ఇలాంటిది ఎక్కువ ఆహారం తీసుకున్నప్పుడు కూడా జరుగుతుంది. కడుపులో ఇన్ టెస్టినెస్ కావలసినంతఆక్సిజన్ ను, న్యూట్రిషియన్లను రక్తంద్వారా పంపడంతో, మెదడుకు తగినంతఆక్సిజన్ అందదు.దీనివల్లఅలసటపొందినట్లవుతుంది. నిద్ర ఆనుకోకుండానేవస్తుంది. కొంచెం విశ్రాంతి తీసుకోగానే ఇది మాయమౌతుంది.

0 Comments