చీమ, దోమ నాకు లెక్కలేదని కొందరు డాంబికాలు పలుకుతుంటారు.మన కంటికి చీమ ఎంత చిన్న గా కన్పించినా చీమ కుట్టగానే అబ్బా !' అనిఅరిచేస్తాం. చీమకు సాహిత్యంలో ప్రత్యేక విశిష్టత వుంది. చీమలు పెట్టినపుట్టలు....బలవంతమైన సర్పం చలిచీమలచేత చిక్కి చావదె సుమతీ! .... శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు....ఇలా ...చీమకు సాహిత్యంలో ఎంతో చోటు వుంది.
చీమ తనకంటే 50 రెట్లు బరువును మోయగలదు. కారణమేమంటే - దీనికిhercleen శక్తి వుందట. అంటే - దీని శరీర నిర్మాణంలో దాదాపు వెయ్యి
రకాల మజిల్స్ వుండటమే. చీమ మజిల్స్ అలసట కేమాత్రం లొంగిపోవు.
మరో ముఖ్యమైన తేడా ఏమిటంటే - చీమకుమూడు జతల కాళ్ళుంటాయి.మొత్తం బరువంతా వాటిమీద విస్తరింపజేసి బరువును మోయగలవు. మనిషికి
ఒక జత కాళ్ళున్నందువల్ల బరువునంతా తన రెండుకాళ్ళపైనేమోశూలి.జంతువుల్లోపరిమాణానికి,సత్వానికి మధ్య సంబంధముంది. జంతువుపరిమాణం
పెరుగుదల ఎంత ఎక్కువైతే అంత సత్వం పెరగాలని లేదు. మరొకటేమిటంటే-పరిమాణం పెరిగితే బరువు కూడా పెరుగుతుంది. ఎక్కువ పెరుగుదలవల్ల సత్వం ఎక్కువ ఏమీ పెరుగదు. దాని నిర్ణీత ఆవధిలోనే అది పెరుగు
తుంది. మనుషుల్లాగా క్రిములు పెరిగితే, వాటికి కూడా చెప్పుకోదగ్గ శక్తివుండదు.

0 Comments