కలలో మటుకు మనిషి తలక్రిందులుగా నడవటానికి సాధ్యమౌతుందిఈగలు, పురుగులు, సాలీళ్ళు, బల్లులు సులువుగా గోడమీదగానీ, తలక్రిందులుగా గానీ నడువగలవు వాటికి మామూలుగా ఆడుకున్నట్లు, సునాయాసంగావుంటుంది, అలా నడుస్తున్నప్పుడు. అవి బరువు తక్కువ వల్ల అలా నడుస్తున్నాయా? మూడు లేక నాలుగు జతల కాళ్ళు వుండటం వల్ల నడుస్తున్నాయా?లేక ప్రత్యేకమైన అమరిక కాళ్ళకు వుండటం వల్ల నడుస్తున్నాయా? అనేప్రశ్నలు మనలో తలెత్తుతాయిఎన్నో పురుగులు, క్రిములు నునుపైన గాజు తలాల పైన, సీలింగ్ లపైన తలక్రిందులుగా నడుస్తుంటాయి. ఆ విధంగా నడవటానికి కారణం వాటికాలి నిర్మాణంలో తేడా వుండటమే. బొద్దింకలు మొదలయిన వాటి కాళ్ళకుచిన్నగా, వాడిగా వున్న "క్లాస్" వుంటాయి. వీటివల్ల సూక్ష్మంగా పట్టుకొనినడువగలవు సీలింగ్ పైగానీ, గాజుపలక మీద గానీ వున్న సూక్ష్మమైనకణాల ఆధారంగా వ్రేలాడగలవు కూడాను. ఈగలు తమ కాళ్ళను ఆ తలాలపైన అతికించి నడువగలవు. వీటి కాళ్ళకు బంకలా కరుచుకుపోయే గుణంవుంది. తేనెటీగకు బొద్దింకలకు, ఈగలకున్న రెండు గుణాలున్నాయి.ఈ ప్రత్యేక అమరికలు, చిన్న శరీరం వుండటం వల్ల పురుగులు తలక్రిందులుగా నడువగలవు.బల్లి పాదాలు గోడలను పట్టుకొని ప్రాకగలిగే ప్రత్యేక నిర్మాణాలతోవుంటాయి. కనుక గోడల పైన నడువగలదు. వీటి పాదాలు గిన్నెల మాదిరిగావుంటాయి. దీనినే 'Adhesive lamella' అంటారు. ఎప్పుడైతే పాదం మోపుతుందో, ఆ పాదాలకు గాలి పీల్చుకునే అమరిక వుండడం వల్ల, పాదాన్నిగోడకు అత్తుకపోయినట్లు చేస్తుంది. ప్రతి అడుగు ఇలాగే వేయగలుగుతుందికాబట్టి సులువుగా గోడమీద ప్రాకగలదు.

0 Comments