Ad Code

Responsive Advertisement

నాడీ పరీక్షలో ఏం తెలుస్తుంది?

 

నాడి మనిషి ఆరోగ్య విషయాల్ని తెలియజేస్తుంది. గుండె సంకోచానికిగురైనప్పుడు రక్తం ఆర్టరీ లోనికి నెట్టబడుతుంది. దీనిని మనం నాడి కొట్టుకోవడం అంటాం. నాడిని మణికట్టువద్ద నే కాకుండా మోచేయికి ముందు ప్రక్కన,మెడ ప్రక్క, కణతి తొడలకు ముందు, మోచేయి, మోకాలు వెనుక భాగానకూడా పరీక్షించవచ్చు. నాడి కొట్టుకోవడం రెండు మణికట్ల దగ్గర ఒకేలాగఉండకపోవచ్చు. ఏ ఒక్క చేతిలోనై నా ఆర్టరీకి ఎలాంటి అడ్డు వచ్చినా నాడికొట్టుకోవడంలో తేడా కనిపిస్తుంది. రెండు మణికట్ల దగ్గర కానీ, కాళ్ళ దగ్గర
కానీ, నాడి సమానంగా కొట్టుకోవడం లేదంటే, ఆట్టోమెన్ లో అరోటాకుఇబ్బంది కలిగిందని గుర్తించుకోవాలి
మామూలు పరిస్థితుల్లో పెద్దలకు నాడి నిముషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఎక్కువ ఇన్ ఫెక్షన్ వల్ల, కొన్ని గ్రంధులు ఎక్కువగా పనిచేయటం వల్ల(థైరాయిడ్, హెయి మోరేజ్ , డయాబెటిక్ కోమా లాంటి గ్రంథులు) నాడి
కొట్టుకోవడం ఎక్కువౌతుంది. ఒక డిగ్రీ ఉష్ణోగ్రత జ్వరంవల్ల శరీరంలో వేడిపెరిగితే, ఎనిమిదిసార్లు ఎక్కువగా కొట్టుకుంటుంది. ఇది పెద్దల్లో చూడవచ్చు.
చిన్న పిల్లల్లో సుమారు 12 సార్లు ఎక్కువగా కొట్టుకుంటుంది. అన్ని జ్వరాల్లోఈవిధమైన పెరుగుదల కనిపించదు. మలేరియా జ్వరం వల్ల అయితే నాడి
కొట్టుకోవడం ఎక్కువగా ఉంటుంది. దైఫాయిడ్ జ్వరంవల్ల ఉష్ణోగ్రత పెరిగినా ,నాడి కొట్టుకోవడం తగ్గుతుంది దీనినిబట్టి టైఫాయిడ్ జ్వరం అని కనుక్కోవచ్చు.నాడి లయలనుబట్టి కూడా కొన్నివ్యాధులనునిర్ణయించవచ్చు. ఉదాహరణకు 6 సెకండ్ల లో ఆరుసార్లు నాడి కొట్టుకుంది అనుకొందాం రెండవసారి ఈ రకంగా కొట్టుకోవటం గుండెకు చెందిన లోపాల్ని తెలియజేస్తుంది. ఒకనిర్ణీత కాలంలో ఎక్కువ తేడాతో నాడి కొట్టుకుందే, గుండెకు భయంకరమైన లోపాలున్నా యని తెలుసుకోవాలి. మామూలుగా గాలి పీల్చేటప్పుడు నాడిఎక్కువగాను, వదిలేటప్పుడు తక్కుగాను కొట్టుకుంటుంది. పెరికార్డియంకు చెందిన జబ్బుల్లో నాడి కొట్టుకోవడం విరుద్ధంగా ఉంటుంది. ఈ పద్ధతిని పారడాక్స్ లేదా పేరడాక్సికల్ అంటారు. కొన్ని సందర్భాల్లో గుండె గట్టిగా కొట్టుకొని, మళ్ళీ మెల్లిగా కొట్టుకుంటూ ఉందనుకుంటే, గుండె కండరాలకు చెందినజబ్బుఏదో ఉందని తెలుసుకోవాలి. ఆరోగ్య చరిత్రలో నాడికి ఎంతో ప్రాముఖ్యముంది. నాడి కొట్టుకోవడం గురించి, 1550 బి.సి.లోనే మొదలయింది చైనాకుచెందిన “చిన్" అనే శాస్త్రజ్ఞుడు దీనికెంతోప్రాముఖ్యత నిచ్చాడు. దీని పైనఅధికార పూర్వకఆధిపత్యాన్ని AD 280 లోసాధించారు.పదిఅమూల్యమైనసంపుటికలనునాడిపైనవ్రాశారు.రెండువందలరకాలనాడికొట్టుకోవటాలనుగురించిఅందులోపేర్కొన్నారు. కేవలం నాడిని పరిశీలించి చైనాకు చెందిన హువ-టు (ఎ.డి.115-205)ఏజబ్బువచ్చిందోతెలిపేవాడట.

Post a Comment

0 Comments

Close Menu