ఎలక్ట్రానిక్ పరికరాల మీద ఉండే స్టార్ రేటింగ్స్ దేనిని గురించి తెలియపరుస్తాయ్

ఈ రోజు మనం మార్కెట్లో ఏ విద్యుత్ ఉపకరణం కొనాలన్నా, వివిధ వాణిజ్య సంస్థల అందిస్తున్న ఉత్పత్తులలో మంచి దానిని ఎంచుకుంటాం. అలా ఎంచుకోవటానికి మనం చాలా అంశాలను పరిగణనలోకి తీసుకుంటాం. ఆ ఉపకరణంతో ఉన్న అవసరాన్ని, దాని ఖర్చుతో భేరీజు వేసి చూస్తాం. ఇంకా కొంచం విద్యుత్ గురించీ, ఆ పరికరం పనిచేసే విధానం గురించి అవగాహన ఉన్న వాళ్ళు- ఈ అంశాలు కూడా కలిపి చూసుకొని, ఉన్నవాటిలో మెరుగైనదానిని కొనుక్కుంటారు.

కానీ సాంకేతిక విషయాల మీద పెద్దగా అవగాహన లేని వారు కూడా సమర్ధవంతమైన ఉపకరణాన్ని, సులభంగా గుర్తించేందుకు వీలుగా బీ.ఈ.ఈ, స్టార్ రేటింగ్ లేబిల్స్ ని జారీ చేస్తుంది.

1. ఎక్కువ స్టార్స్- ఎక్కువ ఆదా

ఏదైనా ఒకే పరిమాణం గల ఉపకరణం, వివిధ బ్రాండ్లలో లభ్యమైనప్పుడు, వాటి మధ్య సమర్ధతని అంచనా వేయడానికి ఈ స్టార్స్ ఉపయోగపడతాయి. ఎక్కువ ఆదా చెయ్యడానికి ఎక్కువ స్టార్స్ కలిగిన బ్రాండ్ పరికరాన్నే ఎంచుకోవాల్సి ఉంటుంది.

2. విద్యుచ్ఛక్తి వినియోగం

స్టార్స్ భాగం కింద పేర్కొన్న సంఖ్య, ఆ ఉపకరణం సంవత్సరానికి ఎన్ని యూనిట్లు విద్యుత్ ని వాడుకుంటుందో చెప్తుంది. ఎంత తక్కువ యూనిట్లైతే వినియోగించుకుంటే, అంత ఎక్కువ ఆదా అయ్యినట్లు.

ఉదా: పై పటంలో, సంవత్సరానికి 700 యూనిట్లు వినియోగం చూపబడింది.

3. లేబిల్ కాలపరిమితి

ప్రతి లేబిల్ కొంత కాలం వరకే చెల్లుతుంది. ఎందుకంటే కాలం పెరుగుతున్నకొద్దీ, కొత్త సాంకేతికత వస్తుంది కాబట్టి అంతకుముందు కన్నా మెరుగైన సాంకేతికత వచ్చినప్పుడు, దానికి 5 స్టార్స్ కేటాయించి, అప్పటి వరకు 1 స్టార్ ఉన్న పరికారాలకి స్టార్ రేటింగ్ రద్దు చేస్తారు.

ఉదాహరణకి ఒక పరికారానిక్ లేబిల్ కాలపరిమితి మారే కొద్దీ, స్టార్ రేటింగ్స్ ఎలా మారతాయో కింది పటంలో చూడొచ్చు.

4. సాంకేతిక వివరాలు

ఆ ఉపకరణం యొక్క పేరు, బ్రాండ్ పేరు మరియూ వివిధ సాంకేతిక పరిమాణాలు ఇక్కడ పొందుపర్చబడతాయి.

5. వర్తించే నియమాలు

లేబిల్ చివరలో ఏ ప్రమాణాల ప్రకారం ఆ ఉపకరణం పరీక్షించబడింది మరియూ ఆ ప్రక్రియలో ఏ పరీక్షా నియమాలని అవలంబించారనే వివరాలు ఉంటాయి.

వివిధ ఉపకరణాల రేటింగ్స్ ని మీరు BEE ఆప్ లో చూడొచ్చు, అలాగే అన్ని బ్రాండ్లని పోల్చి చూసుకోవచ్చు