మీరు నొప్పి నివారిణిమాత్ర వేసుకుంటే కాసేపటికి నొప్పి తగ్గుతుంది. ఏ అవయవానికి నొప్పి వచ్చిన నోటి ద్వారా మాత్ర వేసుకుంటాం.కాలు,చేయ్యి,చెవి లేదా తల ఇలా ఈ భాగం లో నొప్పి ఉంటే అక్కడకు ఎట్లా మందు చేరుతుంది?
నొప్పి నివారిణిలోని medicine మీ శరీరంలోని ఏ భాగానికి బాధను కలిగించదు,దానికి బదులుగా, శరీరంలోప్రతిచోటకి వెళ్లడం ద్వారా పనిచేస్తాయి.మీరు మాత్రమింగిన తరువాత, అది మీ కడుపులోకి వెళ్లి అక్కడ జీర్ణమై మీ రక్తప్రవాహంలో కలిసిపోతుంది. ఇది మీ రక్తంలో చేరిన తర్వాత, medicine మీ శరీరమంతా ప్రయాణిస్తుంది.మీ శరీరంలోని కణాలు గాయపడినప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు, అవి “ప్రోస్టాగ్లాండిన్” అనే రసాయనాన్ని విడుదల చేస్తాయి. మీ శరీరం యొక్క నరాల చివరలు ప్రోస్టాగ్లాండిన్‌కు చాలా సున్నితంగా ఉంటాయి.ప్రోస్టాగ్లాండిన్ విడుదలనుగ్రహించినప్పుడు, మీ నాడీ చివరలు నాడీ వ్యవస్థ ద్వారా మీ మెదడుకు సందేశాన్ని ప్రసారం చేస్తాయి, శరీరంలోని ఒక ప్రాంతం ఎక్కడ మరియు ఎంతబాధిస్తుందోతెలియజేస్తుంది.మాత్రలో ఉన్న మెడిసిన్ కణాలు ప్రోస్టాగ్లాండిన్ విడుదల చేయడాన్ని ఆపివేసినప్పుడు, నాడీ వ్యవస్థ మెదడుకు నొప్పి సందేశాలను పంపడం ఆపివేస్తుంది. అప్పుడు మనకు నొప్పి ఉండదు.. నొప్పి అనేది మీ శరీరం యొక్క ఏదో తప్పు అని హెచ్చరించే మార్గం కాబట్టి మీరు దాన్ని పరిష్కరించవచ్చు.
ఎక్కడైతే సమస్యలు ఉండవో అక్కడకు మెడిసిన్ వెళ్లినా దాని ప్రభావం ఉండదు.మన శరీరం కు ఉన్న ఒక ముఖ్య లక్షణము ఏమిటంటే ఎక్కడైతే మెడిసిన్ అవసరమో అక్కడ కణాలు మెడిసిన్ ను ఎక్కువగా గ్రహించి బాధను నయం చేసుకుంటాయి. కొన్ని సందర్భలలో అవసరము లేని చోట కొన్ని మెడిసిన్ లను కణాలు గ్రహించి దెబ్బతింటాయి.. ఇది చాలా అరుదుగా కొన్ని రకాల మెడిసిన్ల వలన జరుగుతుంది.Cancer ట్రీట్మెంట్ కు చేసే కీమోథెరపీ వలన సైడ్ ఎఫెక్ట్స్ అందుకే వచ్చి జుట్టు ఊడిపోతుంది.
ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ నచ్చితే అందరికి షేర్ చేయండి..

0 Comments