Ad Code

Responsive Advertisement

సముద్రం అడుగున ఉండే ఇంటర్నెట్ కేబుల్స్ మీద దాడులు ఎవ్వరూ చెయ్యరా? చేస్తే వాటిని రక్షించే వ్యవస్థ ఉందా?

 సముద్రం అడుగున ఉండే ఇంటర్నెట్ కేబుల్స్ మీద దాడులు ఎవ్వరూ చెయ్యరా? చేస్తే వాటిని రక్షించే వ్యవస్థ ఉందా.. మనకు క్షణాలలో ఇంటర్నెట్ ద్వారా అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి..అయితే ఇంటర్నెట్ మీ ఇంటికి లేదా మీ ఫోనుకు ఎలా వస్తుందో తెలుసా..ఫోనుకు laptaop కు wireless ద్వారా వచ్చినా  ఇంటికి wire ద్వారా వస్తుంది. ప్రతి ఇంటికి ఊరికి కేబుల్స్ ద్వారా వస్తుంది. దేశాల మధ్య ప్రసారానికి కూడా కేబుల్స్ ద్వారానే వస్తుంది.. మరి దేశాల మధ్య కేబుల్స్ ఎలా వేస్తారంటే సముద్రం అడుగున పెద్ద టెక్నాలజీ ద్వారా వేస్తారు.

సముద్రం అడుగున వేసే కేబుల్స్ ఫైబర్ ఆప్టిక్ తో తయారుచేస్తారు. ఆప్టికల్ ఫైబర్ సాధారణంగా వెంట్రుకంత వెడల్పుంటాయి. ఈ ఫైబర్స్ రక్షణ కోసం ప్లాస్టిక్ పొరలలో, కొన్నిసార్లు స్టీల్ వైర్లో చుట్టబడి ఉంటాయి. సముద్రం ఒడ్డుకు దగ్గరగా వేయబడిన కేబుల్స్ మరింత రక్షణ కోసం అదనపు పొరలను ఉపయోగిస్తాయి. అంతా కలిపి వీటి వ్యాసం కనీసం 25 మిల్లీమీటర్ల ఉంటుంది.

చూడటానికి ఇలా ఉంటుంది

తీరానికి సమీపంలో ఉన్న కేబుల్స్ రక్షణ కోసం సముద్రగర్భం కింద కప్పుతారు. నడి సముద్రంలో అవి నేరుగా సముద్రపు అడుగుభాగంలో వేయబడతాయి. చేపలు పట్టే ప్రాంతాలు, ఫాల్ట్ జోన్లు, లంగర్లు వేసే ప్రాంతాలను తప్పిస్తూ వీటిన ఒక సురక్షమైన పద్ధతిలో వేస్తారు

 . వీటికి సంబంధించిన పరిశ్రమవారు పోర్టు అధికారులు, షిప్పింగ్ కంపెనీలు వంటి ఇతర సముద్ర పరిశ్రమలకు, కేబుల్స్ ఉన్న ప్రదేశంపై అవగాహన కల్పించడానికి సమయాన్ని వెచ్చిస్తుంటారు.

ఆశియా-అమెరికా గేట్వే కేబుల్ 20000 కిలోమీటర్ల దూరం నడుస్తుంది. కొన్ని మాత్రం కొన్ని వందల కిలోమీటర్లు మాత్రమే ఉంటాయి. ఓడ కార్గోలో 100 మైళ్ళ కేబుల్ని జాగ్రత్తగా చుట్టి పెట్టడానికి దరిదాపు ఒక నెల పడుతుంది.

ఈ యంత్రాన్ని కేబుల్ టర్న్ టేబుల్ అంటారు. ఇది కేబుల్ చుట్టని క్రమేపీ సముద్రం అడుగులో దించుతుంది.

ఎక్కువ దూరాలు వేసినప్పుడు ఫైబర్ ఆప్టిక్లో ఉండే సిగ్నల్ బలం తగ్గుతుంది. అందుకుని కొన్ని కొన్ని కిలోమీటర్లకి సిగ్నల్ బలం పెంచటానికి రిపీటర్లని పెడతారు. ఇవి సిగ్నల్ బలం సరిపడా ఉంచుతాయి. అటువంటి రిపీటర్ ఒకటి ఈ క్రింది విధంగా ఉంటుంది.

కేబుల్ ని సముద్ర గర్భంలో వేసే పద్ధతి

పై బొమ్మలోనున్న హైడ్రోజెట్ కేబుల్ యంత్రం ఇలా ఉంటుంది

వేసిన కేబులని పరిశీలిస్తున్న వ్యక్తి

చూసారు కదా వేసిన కేబుళ్ళు ఎంత జాగ్రత్తగా, దట్టంగా, రక్షణతో వేయబడ్డాయో. ఇప్పుడు వీటిని దాడిచేయటం అంత సులువా?

దాడులు- రక్షణ

సరే మనం ఒక సాహసయాత్ర చేద్దాం. అడుగునున్న కేబుల్ ని కోసేద్దాం అని ఎవరికో బుద్ధి పుట్టింది. వెళ్ళిన ఆవ్యక్తి సముద్రం అడుగున ఉన్న కేబుల్కి చేరాలి, అంత లోతులో సముద్ర పీడనం ఉష్ణోగ్రత తట్టుకుంటూ ఆ కేబుల్ ని కోయాలి. దాన్ని కోయడమేమన్నా సులువైన పనా? ఏ రంపం పెట్టి కోయాలి? పోనీ జేమ్స్ బాండులా ఏదో గొప్ప పరికరం వాడి కోసాడనుకుందాం. కోయడానికి ఒక గంటైనా పట్టదా? కోసి మళ్ళీ అంత ఎత్తు ఈది సముద్రంపై తేలాలి. వాటిని పాడుచెయ్యడానికి ఇదొక పద్ధతి. ఇవన్నీ ఒక్క మానవమాత్రుడి వల్ల అయ్యేనా?

మరైతే వాటికి దాడులే జరగవా? పాడవ్వవా? అంటే జరుగుతాయి. కేబుల్ లోపాలు సర్వసాధారణం. సగటున, ప్రతి సంవత్సరం 100 కంటే ఎక్కువ ఉంటాయి. ఐతే, కంపెనీలు ఒకటి కన్నా ఎక్కువ కేబుళ్ళ ద్వారా సమాచారాన్ని పంపిస్తాయి. కాబట్టి ఒకదాంట్లో లోపమున్నా మిగతావి పనిచేస్తుంటాయి. ఈలోగా ఆ పాడైన దాన్ని మరమ్మత్తు చేస్తారు. కేబుల్ లోపాలు ఈ క్రింది కారణానికి జరుగుతాయి

 .

ఎక్కువ లోపాలు లంగరు వేయడాలు, చేపలు పట్టేవారి వల్ల జరుగుతాయి. భూకంపం వంటి ప్రకృతి సంఘటనల వలన కొన్ని, కేబుల్ లోని లోపాలు వలన అతి తక్కువ జరుగుతాయి. సొరచేపలు కొరకటం కూడా అరుదుగా జరుగుతుంది. వీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు.

ఒక కేబుల్ కనీసం పాతిక సంవత్సరాల ఆయువు వచ్చేట్టుగా నిర్మించబడతాయి. అయితే టెక్నాలజీ పాతదైపోవటం వంటి అనేక కారణాలకి పాతికేళ్ళ లోపే వాటిని మార్చేస్తారు. అలా తీసేసిన కేబుళ్ళని అక్కడే సముద్రంలో వదిలేయొచ్చు, కొన్ని కంపెనీలు వాటిని బయటకి తీసి, కొన్ని ముడిపదార్థాల కోసం మళ్ళీ వినియోగిస్తారు. తక్కువ ఖర్చుతో ఐపోతుంది గనుక, ఈ పాత కేబుళ్ళని తక్కవ ఇంటెర్నెట్ అవసరం ఉన్న దేశాలకు పునర్విననియోగం చేస్తారు.




Post a Comment

0 Comments

Close Menu