Ad Code

Responsive Advertisement

మన ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ఊరి పేర్ల చివర "కండ్రిగ" అని ఉంటుంది. ఈ కండ్రిగ అంటే ఏమిటీ? ఈ కృష్ణా జిల్లా కండ్రిగలకు, చిత్తూరు జిల్లాల కండ్రిగలకు ఏమైనా సంబంధం ఉందా?

 

ఖండిక = ఏదైన ఒక గ్రామము నుండి పన్ను లేకుండ గుత్తకిచ్చిన ఒక భూఖండము .

ఖండికకు రూపాంతరములు ఖండ్రిక, కండ్రిక, కండ్రీక, కండ్రిగ.

చిన్న పల్లె, పాళెము, పల్లి, పల్లియ, గ్రామటిక అనే పదాలు ఖండికకు సమానార్థకములు.

సంస్కృతంలో ఖండికా అనగా ముక్క. వేదములోని చిన్న భాగము. వ్యవసాయశాస్త్రములో భూప్రమాణవిశేషముగా కూడ వాడతారు.

చిత్తూరు, నెల్లూరు, ఇలా ఇతర జిల్లాలలో కూడ ఖండ్రిగలు ఉన్నాయి. తూర్పుగోదావరిలో కొత్తపేట-కండ్రిగ పాలకోవాకు ప్రసిద్ధి.

Post a Comment

0 Comments

Close Menu