నేను భాగవతంలో మరియు ఇతర పురాణాలలో ఉన్న ప్రస్తావనలు చెప్పను. ఎందుకంటే వాటిలో ఈ పోలికలు ఉన్న జంతువులు గురించి చెప్పినా అది డైనోసార్ అన్ని ఖచ్చితంగా ఎలా చెప్పగలం అనే వాదన వస్తుంది, ఇక దానికి అంతు ఉండదు . కంటికి కనిపించే ఉదాహరణ చెప్తాను.
స్టెగోసర్స్ అనే డైనోసార్ మీరు జురాసిక్ పార్క్ సినిమాలో చూసే ఉంటారు. దీనిని మొదటి సారి శాస్త్రవేత్తలు ఇంచుమించు ఒక రెండు వందల సంవత్సరాల క్రితం కనుక్కున్నారు. ఇప్పుడు మీకు కంబోడియా లో ఉన్న ఒక హిందూ దేవాలయం మీద బొమ్మ చూపిస్తా, ఇది వెయ్యి సంవత్సరాల క్రితం కట్టబడింది (12 వ శతాబ్దం మొదట్లో) . ఇది మనందరికీ తెలిసిన ఆంగ్కోర్ వాట్ గుడి పక్కనే ఉన్న బ్రహ్మ దేవుడి గుడి (టా ప్రోహ్మ్).
ఇది అదా , కాదా అని ఆలోచించే ముందు మొదట ఎవరైనా ఏదైనా ఉహించి బొమ్మ చెక్కాలన్నా కూడా ఆ ఆలోచన రావడానికి కూడా ఒక మూల వస్తువు ఉండాలి, లేదా దానిని చూసి ఉండాలి. కాబట్టి దీని ప్రస్తావన ఉంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. కానీ దీనిని జీర్ణించుకోవడం కొంచెం కష్టమైన పనే ఒక ఆలోచన ధోరణికి అలవాటు పడిపోయినవాళ్ళకి .
0 Comments