Ad Code

Responsive Advertisement

పులస చేపలు ఎందుకు అంత ఖరీదు?

 

రెండవ ప్రపంచ యుద్దం లో అణుబాంబు మీద పడిన తరువాత జపాన్ దేశం ఎపుడు ఎదుర్కొని కష్టాలు చూసింది. కొన్నాళ్ళకు ఎలాగో సర్దుకుని పట్టాలు ఎక్కడం మొదలు పెట్టింది. అయితే వాళ్ళకి సీ ఫుడ్ ప్రధానం. అందుకే బయట దేశాల నుండి దిగుమతి జపాన్ మరియు ఆసియా దేశాలలో ఎక్కువ ఉంటుంది. అయితే ఇంపోర్ట్ చేసిన ఫుడ్ అంటే అది ఫ్రొజెన్ ఫుడ్. ఎందుకో జపనీయులకు ఆ రుచి అంతగా నచ్చలేదు. కొన్నాళ్ళకు చేపలు తెచ్చి పెద్ద పెద్ద తొట్టెలలో పెంచడం మొదలు పెట్టారు. ముందు రుచి కన్నా కొంచెం బాగానే ఉన్నా మన జపాన్ బుర్ర కి ఆ రుచి కూడా నచ్చలేదు. కొన్నాళ్ళకు మరి కొంచెం తొట్టెలు పెద్దవి చేసి అన్ని రకాల జీవులను అందులో పెంచడం మొదలు పెట్టినతరువాత రుచి మరికొంచెం పెరిగింది. అయినా కూడా మన రోనిన్ జాతి సంతృప్తి చెందలేదు. చిన్న చైనా జీవులతో పాటు షార్క్, తిమింగలాలు పెంచడం మొదలు పెట్టారు. ఈ సొర చేపల భయానికి చిన్న చేపలు ఈదడం, దాక్కోవడం, తప్పించుకోవడం ఇలాంటి పనులు చేయడం మొదలు పెట్టాయి. అపుడు ఆ చేపల్ని తిన్న జపనీయులకు రుచి అత్యద్భుతం గా అనిపించింది. కారణం గడ్డ కట్టిన చేప, జడంగా పెరిగిన చేప, సాధు జీవనం చేసిన చేప కన్నా బుర్ర వాడిన చేప రుచి అన్నిటికంటే బాగుంది అని జపనీయులు ఒక అధ్యయనం లో తేల్చిన విషయం. పులస గురించి చెప్పారా కథలు చెబుతావ్ ఏంట్రా అనుకుంటున్నారా. అక్కడికే వస్తున్నా ఆగండి మరి..

ఇలిషా అనే జాతికి చెందిన వలస రకం చేపలు ( సముద్రం లో ఉండేటపుడు పేరు ) ఆస్ట్రేలియా, టాంజానియా, న్యూజిలాండ్, దేశాల నుండి సంతాన ఉత్పత్తి కోసం ఖండాలు దాటి ఈదుకుంటూ, సముద్రం నుండి గోదావరి బ్యాక్ వాటర్ లోకి వచ్చి పిల్లలు పెడుతుంది. అది కూడా వర్షాకాలం సమయంలో. ఈ సమయం లో దొరకే చేపలను పులస అంటారు. పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి అని మన గోదావరి బ్రదర్స్ ఒక సామెత కూడా చెబుతుంటారు. ఎందుకంటే అంత రేర్ క్వాలిటీ చేప కనుక. ఒక చేపలు పట్టే వ్యక్తి కి ఈ పులస ఒకటి దొరికితే చాలు ఆ రోజు ధర వేలం పాటే తప్ప ఇంత అని లెక్క ఏమి లేదు. పైన చెప్పినట్లు అన్నీ ఖండాలు దాటి బాక్ వాటర్ నుండి వచ్చి గోదావరి లో దొరుకుతుంది కనుక ఈ పులస రుచి మరి దేనికి రాదు ( వంట చేసే వారిని బట్టి ). మామూలుగా కాకుండా ఆవకాయ నూనె, బెండకాయ పులుసు తో కలిపి ఈ పులస మట్టి కుండలో కట్టెల పొయ్యి మీద వండితే ఉంటది నా సామి రంగా. స్వర్గం ప్లేట్ లోకి వచ్చినట్లే ఉంటది.

ఈ పులస చేప సరిగా తెలియకపోతే జరిగే మోసాలు కూడా ఎక్కువే. ఎందుకంటే ధవళేశ్వరం బారెజ్ నుండి సముద్రం కలిసే చోట ఇవి ఎక్కువగా దొరుకుతాయి. సముద్రంలో ఉప్పు నీరు, గోదావరి తీపి నీరు కలిసి ఉండటం వలన ఈ చేపకు ఆ రుచి వస్తుంది. ఎవరయినా మీకు బంగారం ఎరుపు రంగు లో పులస ఇస్తే కొనకండి, ఎందుకంటే అది ఇలస. సముద్రం లో ఉనపుడు ఆ రంగులో ఉంటుంది. కేవలం గోదావరి లోకి వచ్చినపుడే అది వెండి రంగులోకి వస్తుంది. అందులో కూడా సముద్రం నుండి నదిలోకి వచ్చే చేపలకన్నా, నది నుండి సముద్రం లోకి వెలినపుడు దొరికే చేప ఇంకా మంచి రకం. రుచి బాగుంటుంది. ఇది వల లోకి పడిన వెంటనే చనిపోతుంది. బ్రతికుండగా ఈ చేపను చూసిన జాలరి లేరు. పొద్దున్నే ఒక వల వేసి ఉంచితే సాయంత్రానికి ఒకటో రెండో దొరికితే వాడు ఆ పూటకి రాజా. మూములు చేపల వేట పులసకి పనికిరాదు. ఈ పులస ఐస్ లో ఫ్రీజ్ చేసి ఉంచినా రుచి మారుతుంది. అందుకే చాలా మంది వంట వండేసి ఆ కూరని ఇతర ప్రాంతాలకు పార్సెల్ చేస్తారు. ఇంత డిమాండ్ ఉంది కనుకనే నకిలీ వ్యాపారం కూడా బాగానే జరుగుతుంది ఇందులో.

ఇది చదివినపుడు ఎవరికి అయినా నోరు వూరితే ఒక కామెంట్ వేసుకోండి.

Post a Comment

0 Comments

Close Menu