Ad Code

Responsive Advertisement

ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో అన్నం వండడం మంచిదేనా?

 

పొట్టు పొయ్యి, బొగ్గుల కుంపటి, కట్టెల పొయ్యి, కిరోసీన్ స్టవ్, గ్యాస్ స్టవ్, ఇండక్షన్ స్టవ్, ఎలక్ట్రిక్ స్టవ్, రైస్ కుక్కర్ - వీటన్ని మీదా వంట వండడం, ఏ రకం గా వండినా ఒకటేనా? దాని జీర్ణ శక్తీ ఒకటేనా? అది తిన్న తర్వాత శక్తీని ఇచ్చే గ్లూకోస్ లో మార్పు ఉంటుందా?

పొట్టు పొయ్యి, బొగ్గుల కుంపటి, కట్టెల పొయ్యి లలో వండినపుడు వేడి కంట్రోల్ కొంచెం కష్టం. వార్చే పధ్ధతి లో నీరు ఎక్కువ గా ఉండటం వల్ల కొంచెం పర్వాలేదు. కానీ అత్తెసరు ( సరా సరి నీటితో ) పధ్ధతి లో అన్నం అంతా ఒకేలా ఉడకడం కష్టం. అడుగున ఒక్కొక్క సారి మాడు ఉంటుంది. కొంత పలుకు లా కొంత మెత్త గా మారటం ఉంటుంది. అందుచేత అరుగుదల సమానం గా ఉండదు.

వార్చడం పధ్ధతి లో పొంగు వచ్చే వరకూ వేడి ఎక్కువ, తర్వాత సిం లో పెట్టి కంట్రోల్ చేస్తారు. వార్చడం వల్ల కొన్ని పోషకాలు వార్చిన నీళ్ళల్లో బయటకి పోతాయి. బియ్యం లో కూడా కొంచెం తక్కువ పోడగు ( చైన్) స్టార్చ్ వార్చిన నీళ్ళల్లో కరిగి బయటకు వచ్చేస్తుంది. అందుకే గంజి కి చిక్క దనం. గంజి లో సారం ఉందని తెలిసి చాలా మంది గంజి తాగే వారు.

క్రమేణా ప్రెషర్ కుక్కర్ వాడకం పెరిగింది. ప్రెషర్ కుక్కర్ లో ఆవిరి దాదాపు 121 డిగ్రీ ల సెంటిగ్రేడ్ వరకూ వచ్చి బియ్యం ఎక్కువ ఆవిరిలో ఉడికి అన్నం గా మారుతుంది. ఇక్కడ బియ్యం లో ఉన్న స్టార్చ్ మెత్తబడి జిలాటినైస్ అవుతుంది. ఇలా ప్రతీ పలుకు సమానం గా ఒకే రకం గా ఉడికి జీర్ణం సక్రమం గా అవుతుంది. గంజి లో పోయే పదార్చాలు కూడా ఎక్కడికీ పోవు. (మరీ విసిల్స్ వదిలేసి కుక్కర్ మూత సీలింగ్ కి కొట్టుకునే విషయం ఇప్పుడు చర్చించటం లేదు). ప్రెషర్ కుక్కర్ లో వేడి ఎక్కువ, మామూలు కన్నా, ఆవిరి వల్ల, దీని వల్ల పోషక పదార్ధాలు మామూలు గా వండి నట్టు వుండవు, కొన్ని తరిగి పోతాయి. అయితే అన్నం తినేది శక్తీ కోసం, అరుగుదల కోసం అందువల్ల ప్రెషర్ కుక్కర్ ఈ స్టార్చ్, శక్తీ విలువని మనకు పూర్తిగా అందజేస్తుంది.

ఇప్పుడు రైస్ కుక్కర్. ఇది మామూలుగా అటు అత్తెసరు పధ్ధతి గా కాకుండా, ఇటు ప్రెషర్ కుక్కర్ మాదిరి కాకుండా మధ్యస్థం గా వచ్చిన చాలా మెరుగైన పధ్ధతి.

బియ్యం కి సరి పడ్డా నిష్పత్తి లో నీళ్ళు పోసి ఎలక్ట్రిసిటీ ద్వారా వేడి ని అందిస్తున్నాం ఇక్కడ. పాన్ మూత కి ఉన్న రంధ్రాల గుండా ఆవిరీ బయటకు వెళ్తూ ఉంటుంది. బియ్యం నీటిలో మరియు ఆవిరి ద్వారా కూడా ఉడుకుతూ ఉంటుంది. చాలా తక్కువ ప్రెషర్ లో బియ్యం సమానం గా ఉడుకుతుంది. దీని ఉష్ణోగ్రత సమానం గా వచ్చి బియ్యం సమానం గా ఉడుకుతుంది, జిలాటినై జ్ అవుతుంది, అరుగుదల బాగుంటుంది.. కొన్ని అతి ఉష్ణం లో పోయే పోషకాలు అన్నం లోనే ఉండి పోతాయి. పోతే ఆవిరి రంధ్రా ల లోనుండి, మరీ ఎక్కువైతే చుట్టూతా ఖాళీ లో నుండి బయటకు పోతుంది, ఆటో కంట్రోల్ ఉంది కాబట్టీ సేఫ్, పెట్టి వెళ్లిపోవచ్చు.

సారాంశం : ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో వండిన అన్నం సమానం గా ఉడుకుతుంది, జీర్ణమౌతుంది, తిన్న తర్వాత గ్లూకోస్ ద్వారా శక్తిని పూర్తిగా ఇస్తుంది. ఎలక్ట్రిక్ కుక్కర్ లో వండిన అన్నం ప్రెషర్ కుక్కర్ లో వండిన అన్నానికి తీసిపోదు.

Post a Comment

0 Comments

Close Menu