ఎందుకంటే ఆ నోటును ఆర్. బీ. ఐ. ముద్రించదు గనుక. !
మనం వాడే డబ్బుల నోట్ల పై గమనిస్తే రు.2 పై నోట్లన్నింటిపై "భారతీయ రిజర్వు బ్యాంకు " అని ఉంటుంది గాని రు.1 నోటు పై చూస్తే "భారత ప్రభుత్వం " అని ఉంటుంది . ఇది గమనించి ఉంటె ఎవరో ఒకరికి సందేహం వచ్చే ఉంటుంది . రుపాయి నోటు ముద్రించుటకు ఆర్.బీ.ఐ. కు వచ్చిన భాద ఏమిటా? అని 🤔.
దాని వెనుక భలే ఆసక్తికరమైన వివరణ ఉంది .
నిజం చెప్పాలంటే ఆ ప్రభుత్వం తానుగా ముద్రించింది కాబట్టి రూపాయి నోటు మాత్రమే నిజమైన డబ్బు. ఎంత కాదన్నా ఆర్.బీ.ఐ. ఒక బ్యాంకు మాత్రమే .
మరి మిగిలిన నోట్లన్నీ ఏమిటి? అవి డబ్బు కాదా? మామూలు కాగితాల? 😳
అవును అవి డబ్బు ఎంత మాత్రం కాదు . కానీ అవి నిష్ప్రయోజనమైన కాగితాలూ కావు.
మీ దగ్గర ఏదైనా నోటు ఉంటె దానిని గమనించండి . దాని పై ఒక వాగ్దానం ఉంటుంది
"ఈ నోటు కలిగిన వానికి రు.X చెల్లించెదననీ మాట ఇస్తున్నాను
— ఆర్.బీ.ఐ. గవర్నర్"
అంటే ఈ నోటు ఒక "వాగ్దాన పత్రం" అన్నమాట (ప్రామిసరీ నోటు) . దీనిని పట్టుకుని గవర్నర్ గారికి ఇస్తే మనకు అంత విలువ చేసే రు.1 నోట్లు ఇస్తారన్నమాట . చివరికి ఆ వాగ్దాన పత్రానికి రు.X విలువ వచ్చినట్టే కదా. 😄
"ఇంకా టూకీ గా చెప్పాలంటే మన రూపాయి నోట్లను కొన్ని తీసుకుని వాటికి బదులు మనకి ఈ వాగ్దాన పత్రాలు ఆర్.బీ.ఐ. అని అనుకోవచ్చు ."
నోటు వచ్చిన ప్రతి సారి రూపాయిల కోసం గవర్నర్ గారి వద్దకు వెళ్లలేము కాబట్టి ఉన్న నోటూనే ఇచ్చిపుచ్చుకుని వ్యాపారం చేసుకుంటున్నాం .
రూపాయి నోటే అసలైన డబ్బు కాబట్టి దాని పై ఆర్ధిక శాఖ సెక్రటరీ గారి సంతకం ఉంటుంది, వాగ్దానాలు , ప్రతిజ్ఞలు ఉండవు .
అదే ప్రామాణికం కాబట్టి ఏ నోట్లను రద్దు చేసినా, రుపాయి నోటును రద్దు చెయ్యరు ❗ . ( జనాలే దానిని చలామణి తగ్గించేసారు , గానీ దానిని అధికారికంగా రద్దు చెయ్యలేదు🤦♂️ )
2015 లో ముద్రణ మరలా ప్రారంభించిన తరువాత విడుదలైన క్రొత్త రూపాయి నోటు
#ఎదో చులకనగా తీసి పారేసే రూపాయి వెనుక ఇంత కథ ఉంది అండి#
అదే లేక పోతే మన వద్ద ₹2000 నోటు ఉన్నా ఉపయోగం లేనట్టే 😂. 😂
0 Comments