Ad Code

Responsive Advertisement

కుంభకర్ణుని వలె నిద్రపోయే జంతువు ఏది?

 

కుంభకర్ణుడి నిద్రగురించి రావణాసురుడు ఈ విధంగా అంటాడు వాల్మీకి రామాయణం యుద్ధ కాండలో …

సుఖం స్వపితి నిశ్చిన్తః కాలోపహతచేతనః

నవ షట్సప్త చాష్టౌ చ మాసాన్ స్వపతి రాక్షసః

(నా తమ్ముడు నిశ్చింతగా, హాయిగా నిద్రించుచున్నాడు. అతడు తన ఇష్టప్రకారము ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది మాసముల చొప్పున నిద్రించుచుండును.)

ఈ విధంగా నిద్రించడం అతడు తప్పస్సు చేసి (అప్రయత్నంగా) సాధించిన వరం.

అలాంటి వరాన్ని కోరకుండానే కొన్ని జంతువులూ సాధించాయి. ఆహారం సరిగా దొరకని కాలంలో నెలలపాటు తమ జీవక్రియలను నియంత్రించుకొని దీర్ఘకాలం నిద్రపోవడంలో కుంభకర్ణుదితో పోటీపడి గెలువగల సత్తా ఉన్న కొన్ని ఈకాలం పోటీదారులు …

  • నత్త మూడు సంవత్సరాల వరకూ తన నత్తగుల్లలో నిద్రపోగలదు.
  • ఒకరకం రాణి తుమ్మెద (queen bumblebee) 9 నెలలు నిద్రించగలదు.
  • ఎలుగుబంట్లు 8 నెలలవరకూ నిద్రిస్తాయి.
  • Marmot అనబడే పెద్ద సైజు ఉడుత వంటి జీవి 8 నెలలు నిద్రించగలదు.

Post a Comment

0 Comments

Close Menu