Ad Code

Responsive Advertisement

బైకు మీద ఒక ప్రక్కన కూర్చునేటప్పుడు ఎందుకు ఎడమ వైపుకు కూర్చుంటారు? కుడి వైపుకు ఎందుకు కూర్చోరు? కారణం ఏమిటి?

 

నాకు తోచిన కొన్ని కారణాలు -

  • ఒకప్పటి స్కూటర్లకు ఇంజిన్, కిక్ రాడ్ కుడి వైపు ఉండేవి. ఫుట్ రెస్ట్ ఎడమవైపు పెట్టారు. అందుకని ఎక్కువ మంది ఆడవారు ఎడమవైపు కూర్చునే వారు.
  • తర్వాత బైకులు డిజైన్ చేసేటపుడు శారీ గార్డ్ ఎడమవైపు ఫిట్ చేశారు. అందుకని ఎడమవైపు కాళ్ళు పెట్టుకోవడమే శ్రేయస్కరం.
  • మన దేశంలో రోడ్డుకు ఎడమ వైపు నడుపుతారు కాబట్టి, ఎడమ వైపు ఎక్కడం దిగడం ఎక్కువమందికి అలవాటు.
  • బండి నడిపేవారూ ఎక్కువ మంది ఎడమవైపు నుంచి ఎక్కి అగి ఉన్నప్పుడు కుడి పాదం ఫుట్ బ్రేక్ పై, ఎడమ కాలు నేలపై ఉంచుతారు. బ్యాలన్స్ కోసం వెనకవారు ఎడమ వైపు నుంచి ఎక్కడం, ఎడమ వైపు కూర్చోవడం వీలు.

Post a Comment

0 Comments

Close Menu