Ad Code

Responsive Advertisement

నిద్రలేమి పెద్ద సమస్య!

' నిద్ర సుఖం ఎరగదు ' అంటారు . నిద్ర వచ్చి నప్పుడు ఎక్కడైనా ఎటువంటి సౌకర్యాలు కోరకుండా నిద్రపోగలుగుతారు . ఇది మనందరికీ అనుభవమే . నిద్రలేమి ఫలితంగా రోగనిరోధక వ్యవస్థ బలహీనపడి అంటురోగాల బారిన సులభంగా పడు తున్నారు . మానసిక సమస్యలు వస్తున్నాయి , నిద్రపోగలిగితే ఎంతో ఆనందం . నిద్రిస్తే శక్తి వస్తుంది . అన్నిరకాలుగా మేలుచేసే నిద్రకు దూరం అవటం ఏమిటి ! ఒక దేశంలో సమస్యకాదు , నిద్రలేమి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న మరో మహమ్మారి . ఒకరినుండి మరొకరికి అంటేది కాదు , కాని ఒకరి ప్రభావాన మరొకరు నిద్రలేమికి గురయ్యే అవకాశముంది . పాత తరాలు ఇలా దీపాలు ఆర్పేయ గానే అలా అందరూ నిద్రలోకి జారుకునేవారు . కాని ఇప్పుడు నిద్రపోనివ్వని పరికరాలు పెరిగాయి . కుటుంబ సభ్యులందరినీ ఒకే సమయాలు కావు . ఒకరు హాల్ లో టెలివిజన్ చూస్తుంటే మరొకరు నిద్ర పోయే వేళ . ఇంటిలో ఎప్పుడూ కాంతి , ధ్వని వ్యాపించి వుంటున్నాయి . సెల్ ఫోన్ , కంప్యూటర్ పడకగదిలో చేరాక వాటి ద్వారా వచ్చే సందేశాలు పెరిగాయి . చూడకపోతే ఏదో తాజా అంశం ' మిస్ ' అయ్యా మేమోనన్న దిగులు , వెరసి సరిగ్గా నిద్రపట్టని పరి స్థితి . ఒక దశలో నిద్ర తగినంత పోకపోయినా ఎటు వంటి నష్టం కలిగినట్టు కనిపించదు . అదే హుషారుతో పనిచేయగలుగుతుంటారు . కాని తెలియకుండానే
నిద్ర పద్ధతికి దూరమవుతారు . రాత్రి ఎంత సమయం గడిపినా నిద్రపోలేరు . పగలు , రాత్రి తేడాని శరీరం ఆ మరచిపోతుంది . ఫలితంగా నిద్రలేమి జబ్బు వచ్చే కెస్తుంది . ఎంత ప్రయత్నం చేసినా నిద్ర రాదు . తీసే కొంచెం నిద్రతో విశ్రాంతి లభించదు . దీని ప్రభావం ఇతరత్రా పలు అంశాలమీద పడుతుంది . నిద్ర సరిగా పోవాలని చేసే ప్రయత్నం మరిన్ని ఇబ్బందులు తెస్తుంది . నిద్రకోసం మాత్రలను ఆశ్ర యించటం , ఇతర అలవాట్లు చేసుకోవటం వల్ల నిద్రలేమి సమస్య తాత్కాలికంగా పోయినట్టు కన్పించినా కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి . నిద్రను సక్రమంగా పోయే పద్ధతిని తిరిగి పొందటం సులభమే . అందుకు మానసిక సంసిద్ధత , సరైన అలవాట్లు అవసరం . పనికి తగిన నిద్ర నిద్రరాత్రిపూట పోతాం . అయితే నిద్రకుముందు పగటి జీవితం గడుపుతాం.ఆ పగటిపూట చేసే పను లకు , సమయం గడిపే తీరుకు రాత్రి నిద్రకు సంబంధముంటుంది . పగటి సమయాన్ని అర్థవంతంగా గడి పితే రాత్రివేళ ఆనందంగా నిద్రపడుతుంది . పగటివేళ ఆర్థవంతమైనవి , సృజనాత్మకమయిన పనులు చేయటంలో గడపాలి . అందుకు అవసరమైన శారీరక , మానసిక శక్తులను , భావోద్వేగ అంశాలను ఉపయోగించాలి . తన ఎదుగుదలకు నిర్మించే మంచి ఆలోచనలు చేయాలి . ఇతరుల మీద వ్యతిరేక ఆలో చనలు , కుట్రలు చేయకూడదు . సక్రమ మార్గంలో మనస్సు పనిచేసినపుడు తృప్తి , ప్రశాంతతతో నిద్రపోగలుగుతారు . శారీరక శ్రమ తెచ్చే అలసట కూడా నిద్రకు సహకరిస్తుంది . అందుకు భిన్నంగా వ్యతిరేక భావోద్వేగాలతో పగటి సమయం గడిపినా , సమయం వృథా చేసే పను లలో గడిపినా సాయంత్రం అయ్యేసరికి పూర్తి చేయాల్సినవి పూర్తి చేయలేక పోయామన్న ఆందోళన వస్తుంది . పలు రోజులు వర సగా అదే పరిస్థితి ఎదుర్కొంటే ఒత్తిడి తప్పదు . పక్క ఎక్కగానే నిరాశ , నిస్పృహ , కోపతాపాలు , కసి , పోట్లాటలు మనస్సును తొలిచేస్తుంటే నిద్ర రాదు . ఫలితంగా అలా కళ్ళు తెరచే ఉండాల్సివస్తుంది . జీవితానికి అర్థం తెలుసు కోండి.మనం చేయవలసి నవి , సాధించాల్సిన వాటికి స్పష్టతనిచ్చుకోవాలి . లోపలి శక్తులను ' పాజిటివ్ గా పని చేసేలా చూసుకోవాలి . ఇందుకోసం దృష్టి మంచి వైపు మొగ్గాలి . మంచి పనులు , ప్రశాంతమైన మనస్సు , సహాయ పడటం , సహాయం పొందినవారిపట్ల కృతజ్ఞతాభావం కలిగివుండటం , ధ్యానం , ఆధ్యాత్మిక చింతన అవసరం .

జీవితంలో కష్టనష్టాలు అందరికీ ఎదురవుతాయి . ఇబ్బందులు సవాళ్ళుగా స్వీకరించే స్థాయికి మనసు ఎదగాలి . జీవితానికి లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు దానివైపే అడుగులు పడతాయి . ' పాజిటివ్ దృక్పథం కలవారికి నిద్ర సమస్య ఉండదు . భావోద్వేగాలు ' పాజిటివ్ గా ఉంటాయి . వారు చేసే పనులు పాజిటివ్ గా ఉండితీరతాయి . తన జీవితం చక్కదిద్దుకునేందుకు చేసే మంచి ఆలోచనలతో , ప్రశాంతచిత్తంతో మంచంమీదికి వెళ్ళినవారు ఇట్టే నిద్రలోకి జారుకుంటారు . నిద్రలేమి సమస్యను పారద్రోలే ప్రథమ మార్గం ఇది 

 ఇంటికి చేరినతర్వాత ఇతర ఆలోచనలన్నింటినీ క్రమంగా పక్కకు నెట్టాలి . గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి . రాత్రివేళ ఎక్కువగా ఆహారం తీసు కోవద్దు . భోజనం తర్వాత మీ ఎలక్ట్రానిక్ వస్తువుల్ని ముట్టుకోవద్దు . పడకగదిలోకి అసలు వాటిని తీసుకు వెళ్ళకూడదు . పడకగదిలో తక్కువ స్థాయి కాంతి ఉండాలి . ప్రశాంతపరిచే సంగీతం వినండి . వాదనకు దారితీయని , ఇద్దరికీ ఇష్టమైన అంశాల మీదనే కబుర్లు చెప్పుకోండి . ఆలోచనలు మళ్ళించే మంచి పుస్తకం చదవండి .. మనసును ప్రశాంతపరిచే విధంగా గట్టిగా గాలి పీల్చి వదిలే వ్యాయామం చేయండి . ధ్యానం మంచిదే . ధ్యానసహాయంలో వ్యతిరేక ఆలోచనలకు స్వస్తి అనే ' మంత్రం ' పఠించి నిద్రకు ఉపక్రమించండి . ఆ ఆలోచన వద్దు పొరపాటు జరిగితే ఆ అంశంమీదే మనుషుల ఆలోచన ఎడతెగ కుండా సాగటం సహజం . నిద్ర సరిగా పట్టటం లేదు కాబట్టి ఆ నిద్రమీదే ఆలోచనలు పెడతారు . నిద్ర ఎలా పోతు న్నామనే ఆలోచన పదే పదే చెయ్యటంతో , ఇలా నిద్ర పట్టగానే అలా మెలకువ వస్తుంది , తిరిగి నిద్రపట్టదు . ఆ నిద్ర ఆలోచనలే వెంటాడు . తాయి . ఇది ఒక రకంగా తన నీడను తానే వెంటాడటం వంటిది . ఎలాగయినా నిద్రలో పోవాలని దానికోసం కొత్త కొత్త ప్రయోగాలు మొదలు పెడతారు కాని , సమస్య పరిష్కారం కాదు . నిద్రకు ప్రశాంత వాతావరణం మనిషి లోపల , బయట అవసరం . అతి బాధ , అతిగా ఆలోచనలు , విశ్లేషణలేవైనా అవి నిద్రకు అడ్డుపడ తాయి . ఆ ఆలోచనలు నిద్రగురించినవైనా సరే . బాల్యంలో ఎంత హాయిగా , ఎంత ప్రశాంతంగా ఇలా పడుకోగానే అలా నిద్రలోకి జారుకునివుంటారో గుర్తు తెచ్చుకోండి.ఆరుబయట పడుకుని అలా ఆకా శంలోకి చూస్తూ నక్షత్రాల్ని గమనిస్తూ , వీలైతే వాటిని లెక్క పెడ్తూ నిద్రలోకి వెళ్ళిపోయిన రాత్రులు ఎన్నో ఇప్పటికీ గ్రామీణులు అనుభవిస్తూనే వున్నారు . పడుకునేముందు ఆలోచనలు , దిగులు , సందేహా లన్నీ పక్కకు నెట్టగలగటమే ముఖ్యం . నేను నా శరీ రానికి , మనస్సుకు పూర్తిగా విశ్రాంతి ఇవ్వాలను కుంటున్నానని మెదడులో పదేపదే అనుకుని పడు కోండి . శరీర కండరాలన్నీ రిలాక్స్ అవుతాయి . మీ శ్వాసని ఒక క్రమపద్ధతిలో నియంత్రించండి . నెమ్మదిగా నిద్రలోకి వెళ్ళగలుగుతారు .
ధ్యానంతో దూరం 
రాత్రిపూట అందరూ హాయిగా నిద్రపోతుండగా ఒక్కరే నిద్రపట్టక అటూ ఇటూ దొర్లుతూ , నాకే ఎందుకు ఈ నిద్రలేని పరిస్థితి అని దిగులుపడుతూ కూర్చోవటం ఒక భయానక అనుభవం . ఆ అనుభవం ఆదుర్దా పెంచుతుంది . నేనేం తప్పు చేశాను ఈ శిక్షకు అనే ప్రశ్న వేసుకుంటారు . ఇది మరిన్ని ఆలోచనలకు , ప్రశ్నలకు దారితీసి నిద్ర లేమి సమస్యను పెంచుతుంది . అటువంటి పరిస్థితిలో ఇతర పద్ధతులు ఏవీ ఫలించవు . సమస్యను జటిలం చేస్తాయి . అటువంటి పరిస్థితిలో ఇక మిగిలింది ఆ దేవుని ఆశ్రయించటమే . ఆధ్యాత్మిక మార్గంలో అత్యంత ముఖ్యమైనది , మేలుచేసేది ధ్యానం . హింసించటం కోసం భగవంతుడు ఈ లోకంలోకి పంపాడు . శిక్ష వేయటం ఆయన తత్వం కాదు . ఆ విషయం తెలుసుకుని భగవంతునిపట్ల విశ్వాసం పెంచుకోండి . ఆయన సహాయం కోరితే అందకుండా ఉండదు . నిద్రలేమి సమస్య ఆయనపట్ల మీ విశ్వాసా నికి పరీక్ష అనుకోండి . నిద్ర రావటం లేదా ! అయినా బాధ లేదు . చుట్టూ ఎవరూ తోడు లేరా ! అయినా ఆందోళన అనవసరం , అండగా సర్వేశ్వరుడున్నాడు . ఆయన తప్పక ఆదుకుంటాడు . ఆ విశ్వాసంతో మంచంమీద పడుకొని పూర్తిగా ఆయనమీద భారంవేసి ఆ దేవునితో కబుర్లు చెప్పాలి . ఆయనగురించే తలచుకోవాలి . ఆధ్యాత్మిక చింతన మనస్సును ప్రశాంతపరుస్తుంది . ధ్యానంలో జరిగేది ఇదే . పలు ప్రత్యక్ష , పరోక్ష పద్ధతుల్లో ధ్యానం సహాయపడుతుంది . ధ్యానం చేసి నపుడు శరీరంలో మెలటోనిన్ స్థాయి పెరుగుతుందని పరిశోధనలు తేల్చాయి . మెలటోనిన్ ప్రశాంతతను ఇస్తుంది . నిద్రను తెస్తుంది . నిద్రలో కొత్త శక్తి వస్తుంది . లోపాలు తొలగిపోతాయి . గాయాలు మానతాయి . ధ్యావంలో ఎక్కువ సమయంలో గడిపేవారికి తక్కువ గంటల నిద్రతో సరిపోతుంది . నిద్రతో శరీరానికి , మనస్సుకు కలిగే మేలు ధ్యాన సమయంలో జరుగుతాయి . నిద్రలేమి సమస్యను మరచి హాయిగా ధ్యానం చేసుకుని సమస్యనుండి బయటపడవచ్చన్నది నవీన విజ్ఞానశాస్త్రం కూడా చెపుతున్నది . ఎప్పుడన్నా కొన్ని రోజులు నిద్రపట్టకపోవటం సహజం.అటువంటి సమస్యను శరీరం దానంతట అదే సర్దుకుంటుంది . దీర్ఘకాలం నిద్ర సమస్య తలెత్తినపుడే రోజువారీ అలవాట్లను , ఆలోచనలను మార్చుకుని ఆ సమ స్యను దూరంచేసే పద్ధతులు అనుసరించాలి . •


Post a Comment

0 Comments

Close Menu