Ad Code

Responsive Advertisement

పసుపు వలన ప్రయోజనాలు ఇవే!

 బంగారపు రంగులో కని బంపించటమే కాదు వసుపు ఆరోగ్యపరంగా బంగార మంత విలువనిస్తుంది . ప్రకృతిలో లభించే పదార్థాలు , వాటిలోని ఔషధ గుణాలను చాలా ముందుగా గుర్తించి నది ఆయుర్వేదం . ఆ యా ఔషధ గుణపదార్థాలను రోజు వారీ ఆహారంలో భాగం చేశారు మన పెద్దలు . భారతదేశం ప్రపంచం మొత్తాన్నీ ఆకర్షించింది ఇక్కడ లభించే మసాలా దినుసులవలనే . ఆహార పదార్థాలకు చక్కని రంగు , వాసవ అందించటంతో పాటుగా ఆరోగ్యం ప్రసాదించే ఆ దినుసలలో పసుపు ఒకటి . పసుపుకు ఆ బంగారు రంగును అందిస్తుంది దానిలోని ' కుర్కుమిన్ ' అనే రసాయనం . పసుపును పలురకాలుగా ఉపయోగించటం మనకు తెలిసినదే . చర్మ సౌందర్యం కోసం , చర్మ ఆరోగ్యం కోసం పసుపు ఉపయోగిస్తారు . మహిళల జీవితంలో పసుపు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది . జీర్ణక్రియ సమస్యలకు పసుపు వాడతారు .

అలాగే చిన్న పిల్లలకు గాయం అవగానే పసుపు అద్దటం ప్రాథమిక చికిత్స . వి క్యాన్సర్ ని నివారిస్తుంది . పసుపుకి ఎన్నో ఔషధ గుణాలున్నాయి . అది వాపులను తగ్గిస్తుంది . శరీరంలో పల ఉత్పత్తి అయ్యే ఆక్సిడెంట్స్ కి వ్యతిరేకంగా పనిచేస్తుంది . క్యాన్సర్ కారకాలను నిరోధించగలిగి వుంది . శరీరంలో హఠా

త్తుగా జన్యువుల్లో సంభ వించే మార్పులను ఆపు తుంది . ఈ మార్పులే మనుషుల్లో రకరకాల రోగాలు తెస్తుంటాయి . వాటిని నవీన వైద్యపరి భాషలో ఆటో ఇమ్యూన్ రోగాలు అంటారు.రోగనిరోధక వ్యవ స్థలో ఏర్పడేలోపం అది .

ఆ లోపాన్ని అడ్డుకోగలి గిన శక్తి పసుపుది. రక్త నాళాలలో రక్తం గడ్డకట్టినందున సమస్యలు వస్తాయి . అలా రక్తం గడ్డకట్టక , ప్రవాహంలో వుండేలా చేయగలదు . సూక్ష్మజీవులు ముఖ్యంగా రోగకారక క్రిములనుండి శరీరాన్ని రక్షిస్తుంది పసుపు . పసుపుమీద నవీన పరిశోధనలు చాలా జరుగుతున్నాయి . భార తీయులు పసుపును వాడుతున్న తీరును అధ్యయనం చేసి వారు వాడే పద్ధతి సరైనది , పసుపు పై వారికున్న నమ్మకాలు నిజమైనవని ధృవీ కరిస్తున్నారు.గాయాలకు ఇళ్ళలో పసుపు అద్దటంవల్ల ఆ గాయాలు త్వరగా మానతాయనేది అందరికీ తెలిసిందే . పసుపు గాయపడిన కణ జాలాలు త్వరగా ఏర్పడేలా , గాయం త్వరగా మానేలా చేస్తుంది అని తేల్చారు. అంతేకాదు పసుపును వంటకాలలో వాడి నప్పుడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుందని వారు నిరూ పించారు.గాయాలను త్వరగా మాన్పించే పసుపు గుణం పాశ్చాత్య పరిశోధకులను ఆకట్టుకున్నది . అమెరికాలో కీమోథెరపీతోపాటుగా పసుపును ఉపయోగించే ప్రయోగాలు చికిత్సలో భాగమ య్యాయి . పసుపులోని కుర్కుమిన్ కి వాపును తగ్గించే గుణముందని ఆ పరిశోధకులు తేల్చారు . పలురకాల అంటురోగాలను నిరోధించగలిగిన శక్తి వుందని . దీర్ఘకాల రోగాలను తగ్గించే గుణముందనితేల్చారు . ముఖ్యంగా శరీరంలో ఏ భాగంలో అయినా కణి తులు ఏర్పడి , పెరగటాన్ని పసుపులోని రసాయనం ఆపుతుందిభిన్నదశల్లోవున్న క్యాన్సర్ కణాల ఎదుగు దలను నియంత్రించగలుగుతుంది పసుపు . ఔషధ గుణాలు ఈ పరిశోధనల తర్వాత పసుపుమీద ప్రపంచ వ్యాప్త పేటెంట్ పొందే ప్రయత్నం అమెరికన్ సంస్థలు చేయటం గమనించే వుంటారు . క్రీ.పూ. 500 సంవత్సరాల కాలం నుండి పసుపును ఆరోగ్యప్రదాయనిగా భారతీయులు వాడుతున్న వైనం నమోదు అయివుంది . ఆస్త్మా , కీళ్ళనొప్పులు , ఎలర్జీలు , సైనుసైటిస్ , డయాబెటిస్ వంటి పలురకాల రోగులకు పసుపును ఉపయోగించి చికిత్స చేయటం భారతీయ వైద్య గ్రంథాలలో నమోదు అయివుంది . పాశ్చాత్యులలో పేగు క్యాన్సర్ అధికం . ముఖ్యంగా పురీషనాళ క్యాన్సర్ ప్రమాదం పొంచి వుంటుంది . వారికి . భారతీయులలో ఆ క్యాన్సర్ బహుతక్కువ . ఈ తేడాకి కారణం ఆ రెండు ప్రాంతాలవారి ఆహారపు అలవాట్లు అందులోపున్న పసుపు వాడకం ' కుర్కుమిన్'ని ఆహారంలో భాగంగా చేసు కున్నందున శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కు వగా ఏర్పడి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి . పసుపులో వున్న మరో సుగుణం ఎటువంటి " సైడ్ ఎఫెక్ట్స్ ' చూపకపోవటం . పసుపు మోతాదు అధికమైతే కొంచెం గడబిడ కడుపులో కనిపిస్తుంది . అది మినహా మరి ఎటువంటి ఇబ్బందులను ససుపు ఇవ్వదు . అందుకే పసుపు ఆరోగ్య ప్రదాయని అయింది .

Post a Comment

0 Comments

Close Menu