గుండె మరియు ఊపిరితిత్తుల వ్యాధి నివారణ చికిత్సలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న ECMO గురించిన తెలుసుకోండి.
ఎక్స్ ట్రా కార్పోరియల్ మెమ్మేనెస్ ఆక్సిజనేషన్ ( ECMO )అనేది గుండె లేదా ఊపిరితిత్తుల పనితీరు వైఫల్యమైనపుడు వాడే యాంత్రిక విధానం . గుండె శస్త్రచికిత్స తరువాత గుండె పనితీరు మందగించినపుడు లేదా ఊపిరితిత్తులు వైఫల్యం చెందినప్పుడు , ఈ ఎక్స్ ట్రా కార్పోరియల్ మెమ్రనెస్ ఆక్సిజనేషన్ ( ECMO ) విధానాన్ని వైద్యులు సూచిస్తారు . ఈ చికిత్సా విధానంలో రోగి యొక్క రక్తంని ప్రత్యేక నాళాలు ద్వారా శరీరం నుండి బయటకి తీసి ఆక్సినేటర్ అనే పరికరంతో రక్తమును శుద్ధి చేసి తిరిగి రోగి శరీరంలోనికి పంపబడుతుంది . ECMO రోగికి ఒక కృత్రిమ తాత్కాలిక గుండె మరియు ఊపిరితిత్తులుగా పనిచేస్తుంది . గుండె ఫెయిల్యూర్ లేదా గుండె సర్జరీ తర్వాత గుండె పనిచేయకపోవడం , మయోకార్డిటిస్ , కార్డియో మయోపతి , వంటి గుండె సంబంధిత వ్యాధులకు ECMO ఉపయోగించబడుతుంది . అలాగే ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్లు సోకినపుడు లేదా వాటి పనితీరులో సమస్యలకి దీనిని ఉపయోగించవచ్చును . ఇది చాలా అరుదైన ప్రక్రియ , దీనికి నిర్వర్తించడానికి అనుభవం కలిగిన వైద్య నిపుణుల బృందం అవసర - పడుతుంది . గుండె చికిత్సలో ఉపయోగించే ECMO విషయంలో , రక్తం ప్రధాన సిర నుండి తీసుకుని ధమని ద్వారా తిరిగి పంపబడుతుంది , ఊపిరితిత్తుల చికిత్సలో వాడే ECMO విధానంలో సిర నుండి రక్తాన్ని తీసుకుని మరలా సిర లోనికి సరఫరా చేస్తుంది . తీవ్రమైన ఇన్ఫెక్షన్ల కారణంగా ఊపిరితిత్తులు దెబ్బతిన్న సందర్భంలో వెంటిలేటర్ ద్వారా రోగి ఆక్సిజన్ తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కున్నప్పుడు ఊపిరితిత్తులకు విశ్రాంతి కలిగించాలి .
uఅటువంటి పరిస్థితులలో శరీరానికి
Console ECMO ద్వారా ఆక్సిజన్ని అందించడాన్ని వైద్యులు సూచిస్తారు . భారతదేశంలో ఈ ECHO పై అవగాహన పెంచాలి . ఈ విధానంలో అంతర్గత రక్తస్రావం , గడ్డ కట్టడం , ఇన్ఫెక్షన్లు , అధిక రక్తస్రావం మరియు కోలుకోలేని అవయవ వైఫల్యం లేదా మెదడు ప్రమాదాల వంటి దుష్ప్రభావాలు ఉన్నప్పటికీ , ఖరీదైనది అయినప్పటికీ , ప్రభావవంతంగా పనిచేసి త్వరగా ప్రాణాపాయ స్థితి నుండి మెరుగుపడే అవకాశాలను పెంపొందిస్తుంది.
గుండె మరియు ఊపిరితిత్తుల సమస్యలతో ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కునే వారికి ఈ ECMO విధానం సమర్థవంతంగా పనిచేసి వారి జీవితానికి పునర్జన్మని ప్రసాదిస్తుంది .
0 Comments