జీవం ఉండే ప్రతి కణం క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంటుంది . అందుకే మొక్కలతో సహా ఈ సృష్టిలో జీవరాశి అంతా ఈ ప్రాణాంతక వ్యాధి బారినపడూ ఉంటాయి . మన శరీరంలో కణాలు పరిపక్వ స్థితికి రాగానే ఒకటికి ఎన్నొకణాలుగా విభజన చెందుతూ ఎప్పటికప్పుడు కొత్త కణాలు ఏర్పడుతూ ఉంటాయి . వయస్సు పైబడే కొద్ది ప్రతి కణానికి కాలం చెల్లి సమయం దగ్గర పడూ ఉంటుంది . చిన్న వయస్సులో శరీర కణాలు వేగంగా వృద్ధి చెందుతూ ఉంటాయి కాబట్టి ఎదుగుదల సాధ్యం అవుతుంది . పెద్దవారు అయ్యేకొద్ది కణాలు విభజన చెందటం వృద్ధి చెందటం నిదానము అయి శరీరం ఎదుగుదల ఆగిపోతుంది . పాతగా అయిపోయిన కణాలను భర్తీ చేయటానికి మాత్రమే కొత్త కణాలపుట్టుక వయస్సు పైబడిన వారిలో జరుగుతూ ఉంటుంది . అయితే సహజ సిద్ధంగా క్రమబద్ధంగా జరిగే ఈ ప్రక్రియలో ఎక్కడో తేడా వచ్చి , పాత బడిన కణాలు మృతి చెందకుండానే అనేక కొత్త కణాలు పుట్టుకొని రావటంవలన , వచ్చిన శరీర భాగాలలో కణితులు ఏర్పడుతూ ఉంటాయి . ఆ భాగానికి పరిమితం అయి ఉండే ప్రమాదకరం కాని కణితులు కొన్ని అయితే , ఇతర భాగాలకు , చుట్టు ప్రక్కల కణజాలానికి రక్తం ద్వారా లింఫ్ నాళాల ద్వారా వ్యాప్తి , చెందే ప్రమాదకర కణితులు క్యాన్సర్ కణితులు . వయస్సు పైబడే కొద్ది పెరిగే క్యాన్సర్ కణితులుకు మన సామాజిక పరిసరాలకు సంబంధించి , అనేక కారణాలు , దురలవాట్లు , వాతావరణం , వృత్తి పరమైన కారణాలు , కాలుష్యం , జీవనశైలి , హర్మోన్ల వాడకం , కుటుంబ చరిత్ర , కొన్ని రకాల వైరస్లు , బ్యాక్టరియా , ఎరువులు , రేడియేషన్ ఇలా ఎన్నో కారకాలు దోహదపడ్డాయని చెప్పుకోవచ్చు . నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ( NCI ) సర్వే ప్రకారం కొత్తగా కనుగొనే క్యాన్సర్స్ లో 60 శాతం వరకు 65 ఏళ్లు పై బడిన వారిలో కన్పించటమేకాక వీరిలో 70 % వరకు మరణానికి గురవుతూ ఉంటారు . చిన్న వయస్సులో ఉండే వారితో పోల్చుకుంటే 65 ఏళ్లు పైబడిన వారు క్యాన్సరు గురయ్యే ప్రమాదం 10 రెట్లకు పైగా ఉంటోంది . వయస్సు పైబడిన వారిలో అన్నిరకాల క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం ఎక్కువే . మరీముఖ్యంగా కోలన్ , రెక్టల్ , ప్రోస్టేట్ , ప్యాంక్రియాస్ , ఊపిరి తిత్తులు , మూత్రాశయం , పెద్ద పేగులు , రొమ్ము క్యాన్సర్లు వయస్సు పైబడే కొద్ది వచ్చే ప్రమాదం ఎక్కువవుతూ ఉంటుంది . అంతే గాక వీరిలో ఈ కణితులు ట్రీట్ మెంట్సకు లొంగకుండా ఉండే అవకాశం కూడా ఉండవచ్చు . అధికరక్తపోటు , మధుమేహం , కీళ్ల అరుగుదల , థైరాయిడ్ సమస్యలు , గుండె రక్తనాళాలలో పూడికలు , వంటి సమస్యలు వయస్సుతో పాటు పెరిగి వేధిస్తూ ఉంటాయి కాబట్టి వీరికి క్యాన్సర్ ట్రీట్ మెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా అలోచించి పర్సనలైజ్ గా ఇవ్వవలసి ఉంటుంది . వారి శరీర ఆరోగ్య పరిస్థితులనే కాక వారి మానసిక , సామాజిక , కుటుంబ , ఆర్థిక పరిస్థితులను గురించి కూడా ఆలోచించి క్యాన్సర్ బారిన పడిన వారికి ధైర్యం చెప్తూ ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది . అందుకే వీరికి ట్రీట్ మెంట్స్ లో భాగంగా కౌన్సిలింగ్ ప్రాముఖ్యత కూడా ఎక్కువగా ఉంటోంది . వయస్సు పైబడే కొద్ది క్యాన్సర్‌కు గురికాక తప్పదా ? అన్న దిశలో శాస్త్రవేత్తలు అనేక రకాలుగా పరిశోధనలు చేశారు . వయస్సుకు క్యాన్సర్కు సంబంధం ఎక్కువ అవటానికి అనేక కారకాలు దోహదం చేస్తూ ఉన్నాయని పరిశోధనలు నిరూపించాయి . వాటిలో ఈ క్రింది వాటిని కొన్ని కారణాలుగా పేర్కొన్నారు . 1. చిన్నప్పుడు దీర్ఘకాలికంగా ఉన్న స్మోకింగ్ , అల్కహాల్ , అనేక మందితో శారీరక సంబంధాలు వంటి దురలవాట్లు . 2. వయస్సు పైబడే కొద్ది రోగనిరోధక శక్తి తగ్గటం 3. కొన్ని రకాల హార్మోన్స్ ఎక్కువగా తీసుకోవటం 4. కణాలలో మార్పులు నెమ్మదిగా జరిగి వయస్సు పైబడ్డాక బయట పడటం 5. వృత్తిపరంగా కొన్నిరకాలరసాయనాలకు ఎక్కువగా గురవటం 6. వేరే వ్యాధులు వాటికి తీసుకునే ట్రీట్ మెంట్స్ చిన్నవయస్సులో , మధ్య వయస్సులో ఉండే అలవాట్లు వలన కణజాలాలలో నెమ్మదిగా జరిగే మార్పులు వయస్సు పైబడ్డాక బయటపడ్డూ ఉంటాయి . వెర్నర్ నిండ్రామ్ ( Werner Syndrome ) , ఆల్జిమర్స్ ( Alzheimer's ) , ఎయిడ్స్ మొదలగు వ్యాధులు ఉన్నవారికీ క్యాన్సర్ వచ్చేరిస్క్ పెరుగుతుంది . శరీరంలో హార్మోన్ లెవల్స్ ఎక్కువగా ఉన్న పెద్దవారిలో కొన్ని రకాల క్యాన్సర్స్ ఎక్కువ . ఉదాహరణకు ఈస్ట్రోజన్ లెవల్స్ దీర్ఘకాలికంగా ఎక్కువగా ఉన్న స్త్రీలలో రొమ్ము , ఎండోమెట్రియల్ , అండాశయల క్యాన్సర్స్ అధికం . 60 ఏళ్లు పైబడ్డాక కూడా స్త్రీలలో నెలసర్లు ఆగలేదంటే కొంచెం అనుమానించాలిసిందే . 9 ఏళ్లకీ నెలసర్లు , లేటుగా మ్యారేజ్ , ప్రెగ్నెన్ని ప్లాన్ చేసుకొవటం కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే రిస్కను పెంచే అవకాశం ఉంది . పురుషులలో టెస్టోస్టిరాన్ హార్మోన్స్ లెవల్స్ - ప్రోస్టేట్ క్యాన్సర్ కు దారితీసే అవకాశం ఉంటుంది
అందుకే ఇటువంటి హార్మోన్లకు సంబంధించిన క్యాన్సర్‌కు ట్రీట్మెంట్స్ లో సర్జరి , రేడియేషన్ , కీమోలతో పాటు హార్మోన్ థెరఫి ప్రాముఖ్యత కూడా ఉంటుంది . యుక్త వయస్సులో , - . తెలిసి తెలియని 3 వయస్సులో సరాదాలకు , స్నేహితులకు అగ్రపీఠం వేస్తూ చేసుకున్న అలవాట్లు వలన వాటికి దూరం అయినా నిబ్బరంగా ఉండటానికి అవకాశం లేదు . స్మోకింగ్ , ఆల్కహాల్ అనేక మందితో శారీరక సంబంధాలు , లంగ్ , లివర్ , సర్వైకల్ క్యాన్సర్సనే కి కాక ఇంకా ఏ భాగానికైన క్యాన్సర్ను కలిగించే అవకాశం ఉంటుంది . ఈ కణితులకు ఖచ్చితమైన కారణాలు తెలియవు అనేక ఇతర కారణాలు 5 జన్యుపరమైనవి కారకాలు ఉండవచ్చు . అయితే దురలవాట్లకు , కెమికలకు గురయ్యే వారిలో 5 సాధారణ ప్రజానికం కంటె క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ . అలవాట్లకు అతీతంగా వయస్సు పైబడిన - వారందరూ స్క్రీనింగ్ టెస్టు చేయించుకుంటూ - ఉంటే మంచిది . స్త్రీలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను ముందే పసిగట్టటానికి 35 ఏళ్లు పైబడిన దగ్గర నుండి పాప్ స్మియర్స్ , రొమ్ము క్యాన్సరు 2 తెలుసుకోవటానికి 40 ఏళ్లు పైబడిన వారు మామోగ్రామ్స్ , సెల్ఫ్ ఎగ్జామినేషన్ అలాగే పురుషులో 50 ఏళ్లు పైబడ్డాక ప్రోస్టేట్ క్యాన్సర్‌ను తెలిపే PSA టెస్ట్ , హెపటైటిస్ -B పాజిటివ్ గా ఉన్న వారు లివర్ , స్మోకింగ్ ఆల్కహాల్ అలవాట్లు ఉన్నవారు లంగ్స్ , లివర్ వరీక్షలు చేయించుకుంటూ ఉంటే మార్పులను ముందే పసిగట్టవచ్చు . చిన్న వయస్సు నుండే మంచి ఆహార , వ్యవహార - జీవనశైలితో పాటు శరీరంలో మార్పులను ముందే పసిగట్టే స్క్రీనింగ్ టెస్టు , తొలిదశలోనే చికిత్సలతో క్యాన్సర్‌కు చెక్ పెట్టవచ్చు అని అందరూ ఆ అవగాహన పెంపొందించుకోవటం తప్పనిసరి .
0 Comments