ఎడుస్తున్నప్పుడు కండ్లనుండి కన్నీళ్ళు వస్తాయి . ఇలా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా ? కందరముల కదలిక వల్ల మనము వేదిక మీద తెరలను ఎత్తి దింపినట్లు కనురెప్పలను మూస్తుంటాము . కనురెప్పల కదలిక అత్యంత వేగంగా ఉంటుంది . ఆటంకం కలుగదు . కనురెప్పలు అల్లలాడించటమన్నది అసంకల్పిత చర్య . ఇది ప్రతి ఆకు సెకనులకు ఒకసారి జీవిత కాలమంతా జరుగుతుంది . రెండు కళ్ళలో చివర కొలకులందు బాష్ప గ్రంథులు ఉంటాయి . కొన్ని నాళములు ఈ గ్రంథులలోని బాష్పములను పైరెప్పలకు చేరుస్తాయి . మరికొన్ని నాళములు వాటిని తీసుకువెడతాయి . కనురెప్ప మూసినపుడు నాళములు తెరుచుకొని బాష్పములు బయటకు వస్తాయి . దీనివలన కండ్లు ఎప్పుడూ తడిగా ఉంటాయి . మనము ఏడ్చునపుడు ఎక్కువ బాష్పములు నాళములనుండి వెలువడుతాయి . కంటినుంచి బయటకు ప్రవహిస్తాయి . ఇది అసంకల్పిత ప్రతీకార చర్య . ఒకొక్కసారి మసం ఎక్కువ నవ్వినపుడుకూడా కళ్ళవెంబడి ఆశ్రువులు వస్తాయి . మనం నవ్వినపుడు కండరములు బాష్పగ్రంథులను ఒత్తుతాయి . తద్వారా కంటినుంచి బాష్పములు వెలువడుతాయి . ఉల్లిపాయలు తరుగుతున్నపుడు ఇదేవిధంగా కన్నీళ్ళు విడవకుండా వస్తాయి . నిజానికి ఉల్లిపాయ ఆవిరివంటి పదార్థాన్ని విడుదల చేస్తుంది . అది కంటిని చేరేసరికి దానినుంచి రక్షణకు కంటినుంచి బాష్పములు వెలువడుతాయి . ధూళి మొదలైనవి కంటిలో పడినపుడుకూడా వాటిని పార ద్రోలే ప్రయత్నంలో నే కన్నీళ్ళు వెలువడుతాయి . పొగలోను ఈ కారణంగానే కన్నీళ్ళు వస్తాయి . విషాద వార్త విన్నపుడు అసంకల్పితంగా కన్నీళ్లు వస్తాయి . మన భావాన్ని వ్యక్తం చేయ దానికి మాటలు చాలనపుడే ఇలా జరుగుతుంది .
0 Comments