Ad Code

Responsive Advertisement

నేటి సమాజం తెలుసుకోవలసిన భారతీయ ఋషి పరంపర

 


ఒక దీపం మరో దీపాన్ని , ఈ దీపం మరి కొన్ని దీపాలను వెలిగిస్తుంది , ఇది పరంపరగా కు సాగుతుంది . చీకటిని పారదోలేది వెలుగు ; అజ్ఞాన తిమిరాన్ని దూరం చేసేది జ్ఞానజ్యోతి . గురువు నుంచి శిష్యునికి పరంపరగా కొనసాగుతూ ఉంటుంది . “ ఆదిగురువు " భగవంతుడు ఆ తేజోటు మన దేశమే ఒక " ఋషి పీఠం " , విశ్వగురుపీఠం . ప్రపంచం కళ్ళు తెరవక ముందే ఇక్కడ జ్ఞానతేజం చెన్న వెరిసింది . సమగ్ర విజ్ఞానం , సర్వ శాస్త్రాలు ఇక్కడ శోభిల్లాయి . భారత దేశమంటే , వెలుగుపై మక్కువ చూపే దేశమని అర్థం అనగా భా = వెలుగు | జ్ఞానము , రతము అనగా ఋతము వైపు పయనించువాడు . ఋతము అంటే పరమ సత్యమును తెలియజేయు విజ్ఞానం .ఋషి చేత , తపస్సు చేత అట్టి విజ్ఞానాన్ని పొంది , దానిని  నుంచి మన వరకూ జ్ఞానాన్ని అందించిన పరంపరయే ఋషిపరంపర . = ఇష్టము అని అర్థం . జగతికి అందించిన వారు ఋషులు . వేదం మొదలుకొని సర్వ భారతీయ శాస్త్రజ్ఞానం వీరు మనకందించిన జ్ఞాననిధి . ఆధునిక శాస్త్రజ్ఞులు తమ పరిశోధనలను కేవలం భౌతిక విషయ సృష్టికే పరిమితం చేస్తే ఆనాటి ఋషులు భౌతికాతీత విషయాలను ( సృష్టిలోని మూల సత్యాలను ) ఇంద్రియాతీతమైన ప్రజ్ఞతో తపోబలంతో , నిస్వార్థంగా , జగతికి అందించారు . ఈ ఋషి పరంపరలో అగ్రగణ్యులు సప్తఋషులు ; వారు నేటికీ తేజోస్వ రూపాలుగా , నక్షత్ర రాశిలో మనకు దర్శనమిస్తారు . ప్రతినిత్యం వీరిని స్మరించటం , భారతీయుల ఆనవాయితీ . అగస్త్య మహర్షి , అత్రి మహర్షి , అంగీరస మహర్షి , కశ్యప మహర్షి , భృగు మహర్షి వశిష్ట మహర్షి , విశ్వామిత్ర మహర్షి . వీరిని సప్తఋషులంటారు . కాని ఈ పేర్ల విషయంలో పలు వివాదాలు ఉన్నాయి . వేరు వేరు సప్తఋషుల పేర్లు కనిపిస్తాయి.

1. అగస్త్య మహర్షి :

వశిష్ఠ మహర్షి సోదరుడు . లోకహితం కోరి దేవతలు వేడుకొనగా వారి కోసం సముద్రాన్ని ఔపోసన ' పెట్టిన వాడు . అగస్త్యుడు శ్రీరామునికి వనవాస కాలంలో పంచవటిలో నివసించమని సూచించి కొన్ని అనుర్భాణాలను కూడా ప్రసాదించిన వాడు . ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ' ఆదిత్య హృదయం ' అనే సూర్య స్తోత్రాన్ని , రామునికి ఉపదేశించాడు . చక్షణ భారతదేశంలో , ముఖ్యంగా తమిళనాడులో ప్రసిద్ధి గాంచిన ' సిద్ధ వైద్యానికి ' మూల పురుషుడు , అగస్త్యుడు . ఇతను రచించిన శక్తితంత్రము / శక్తిసంహిత | అగస్త్య సంహిత గ్రంథాలలో ' విద్యుత్ శక్తి ' గురించి , దానిని తయారుచేసే విధానం గురించి వివరింపబడింది . ధనుర్విద్యా రహస్యాలు , ఇతర విద్యలు అగస్త్య మహాముని భాద్రపద మాసంలో నక్షత్రంగా మనకు దర్శనమిస్తాడు . చెందింది . అగ్నికి బదులుగా అతని కార్యం నిర్వహించిన సమర్థుడు అంగీరస మహర్షి . 

2 అత్రి మహర్షి:

 సప్త ఋషులలో అత్రి మహర్షి ఒకడు . అత్రి మహర్షి అర్థాంగి అనసూయ . ఇతను బ్రహ్మ మానస పుత్రుడు . సృష్టి నిర్మాణంలో బ్రహ్మకు సహాయపడిన దివ్య పురుషుడు . త్రిమూర్తులను పసిపాపలు చేసి , మాతృభావంతో వారికి ఆతిధ్యం ఇచ్చింది తపో నిష్టురాలైన అనసూయ . ఆమె ఇతని శ్రీమతి . సీతా రామ లక్ష్మణులకు ఆతిథ్యమిచ్చిన వాడు అత్రి మహర్షి . ఋగ్వేదంలో అత్రి సంహితను ఉపదేశించిన మంత్రద్రష్ట . ఆత్రేయ ధర్మశాస్త్రం | ఆత్రేయ స్మృతి అన్నది చాలా ప్రసిద్ధి గల ధర్మశాస్త్ర గ్రంథం , నేటికీ చాలామంది దీనిని పాటిస్తారు . అత్రి మహర్షి కృషి యుగాలు గడచినా ఇంకా నిలిచి ఉంది . 

3. అంగీరస మహర్షి:

ఈయన కూడా బ్రహ్మ మానస పుత్రుడు . తన తపఃశక్తితో ఈ సృష్టి నిర్మాణంలో బ్రహ్మకు సహాయపడ్డాడు . ఇతను కర్దమ ప్రజాపతి కుమార్తె శ్రద్ధను వివాహ మాడాడు . ఈ అంగీరస వంశం ఎంతగానో వృద్ధి చెందింది.అగ్ని బదులుగా అతని కార్యం నిర్వహించిన సమర్థుడు అంగీరస మహర్షిఅంగీరస స్మృతి అనే ధర్మశాస్త్రం లోకమున ప్రసిద్ధి గాంచినది . అంగీరసుడు అధర్వణ వేద మంత్రాలకు ద్రష్ట . ఉపనిషత్తులలో అంగీరస ప్రస్తావన కలదు . అంగీరసుడు ఓంకార రహస్యాలను ముండకోపనిషత్తు నందు వివరించాడు . సప్తఋషులలో ఒకడైన అంగీరసుడు సప్త ఋషి మండలంలో తేజోరూపంతో మనలను అనుగ్రహిస్తూ ఉంటాడు .

 4. భృగు మహర్షి :

బ్రహ్మ హృదయం నుండీ జనించిన వాడు భృగువు . నవబ్రహ్మలలో ఒకనిగా ప్రసిద్ధి చెందాడు . భృగు వంశ మూలపురుషుడితడు . ఇతను కర్దమ ప్రజాపతి కుమార్తె ఖ్యాతిని వివాహమాడాడు . యాగఫలాన్ని పొందగల వారిని ఎంచుకొను టకు త్రిమూర్తులను పరీక్షింపవచ్చి శివునికి లింగాకృతినీ , బ్రహ్మకు గుడిలేని శాపమునూ ఇచ్చి విష్ణువును భూలోకానికి రప్పించిన వాడు . హరిని యాగఫలకర్తగా నిర్ణయించిన తపస్సంపన్నుడు . భృగుమహర్షి ' జ్యోతిష్య శాస్త్రసారం ' రచించాడు . భరధ్వాజునికి సృష్టి రహస్యాలు బోధించాడు . పరశు రాముడు శివుని మెప్పించి ' భార్గవాస్త్రం ' సంపాదించడానికి ఉపదేశమిచ్చిన వాడు భృగువు . ధర్మశాస్త్ర సూక్ష్మాలను ఎందరో మహర్షులకు బోధించిన భృగుమహర్షి ప్రాతఃస్మరణీయుడు .

 5. కశ్యప మహర్షి:

ఇతను సప్త ఋషులలో ఒకడు . ఇతను మారీచ మహర్షి పుత్రుడు . కశ్యపవంశ మూలపురుషుడు . ఇతను దక్ష ప్రజాపతి కుమార్తెలను వివాహమాడెను . ద్వాదశ ఆదిత్యులను , హిరణ్యాక్ష , హిరణ్య కశ్యపులను , కద్రువ నాగులను , రాహువును , గంధర్వులను , క్రోధమును , రోగనములను , బ్రాహ్మణులను , మేనకాది అప్సరసలను , సిద్ధులను , చంద్రాది దేవతలకు కశ్యపుడు తండ్రిగా జన్మలనిచ్చి సృష్టి ధర్మాన్ని కొన సాగించాడు . “ కశ్యపి ” అనే గంగను భువికి తీసుకుని వచ్చిన వాడు . కశ్యప మహామునికి “ వామనుడు " కూడా జన్మించాడు . కశ్యపుని పేరు మీద ' శిల్ప ' శాస్త్రం కలదు . దీనిలో రాజభవనాలు , దేవాలయాలు , సభామందిరాలు మొదలైన వాని నిర్మాణ సంగతులు , వాస్తుశాస్త్ర రీతులు ఉన్నాయి . 

6. వశిష్ఠుడు:

 ఇతను బ్రహ్మ మానసపుత్రుడు . ఇక్ష్వాకుల కుల గురువు . వశిష్ఠుని సతీమణి మహాసాధ్వి అరుంధతి . ఇతడు రామునికి “ యోగవాశిష్ఠము ” బోధించెను . ఇది ' గీత ' వంటిది . చాలా ప్రసిద్ధి గాంచినది.వశిష్ట స్మృతి , మను స్మృతి తరువాత అంత గొప్పది . క్షత్రియుడైన విశ్వామిత్రుని రాజర్షిగా , బ్రహ్మరిగా తీర్చిదిద్దినవాడు . బ్రహ్మతేజో సంపన్నుడు , నవబ్రహ్మలలో ఒకడు . సప్త ఋషులలో ఆరాధ్యనీయుడు  వశిష్టుడు.

7. విశ్వామిత్రుడు 

 విశ్వామిత్రుడు తొలిగా క్షత్రియుడు , రాజు . వశిష్ఠునితో తలపడి , ఎదురు నిలచి బ్రహ్మ ఋషి కావాలనే తలంపుతో మహాతపస్సు చేసి బ్రహ్మర్షిగా ఎదిగిన వాడు . విశ్వామిత్రుని గాథ మనకు సదా స్పూర్తినిస్తుంది . ప్రతి ఓటమిని ఒక విజయంగా మార్చుకుని సప్త ఋషులలో ఒకనిగా నిలిచిన ధీశాలి . విశ్వామిత్రుని రామునికి శస్త్ర విద్యలను నేర్పించిన వాడు , దుష్టశిక్షణ కోసం రామ లక్ష్మణులను వినియోగించిన వాడు . యంత్రాల గురించి వివరించాడు . విమాన శాస్త్రం కూడా ఇందులో భాగమే . ఆధ్యాత్మికంగా ఎదగడానికి బ్రహ్మర్షిగా నిలవడానికి పడిన తపన సప్త ఋషి కండలంలో నిలువ గలిగిన సంకల్ప బలం యుగయుగాలకు అందరికి స్ఫూర్తినిచ్చే దివ్యగాథ . హరిశ్చంద్రుని సత్యశీలత జగతికి చాటిన వాడు . త్రిశంకు సృష్టి అనే సృష్టికి ప్రతిసృష్టి చేసిన మహర్షి విశ్వామిత్రుడు . హైందవ జాతి నిత్యం స్మరించే “ గాయత్రి ” మంత్రం ప్రసాదించినది విశ్వామిత్రుడే . ఈ సప్త ఋషులు మనకు సదా రక్షగా నిలిచి మన బుద్ధిని ప్రేరేపించి , మనలను సన్మార్గాలలో నడుపుదురు IPS ! ఎందరో మహర్షులు , వారందించిన విజ్ఞానం అనంతం , వారి విశ్వకళ్యాణ భావం , సంకల్ప శుద్ధి జగతిని సదా రక్షించుగాక ! వాల్మీకి , వ్యాసుడు రామాయణ , భారత గ్రంథాలు రచించారు . వ్యాసభగవానుడు వేదాలను నాలుగు భాగాలుగా విభజించాడు . అష్టాదశ పురాణాలను రచించాడు . పైల మహర్షికి ఋగ్వేదం , వైశంపాయనునికి యజుర్వేదం , జైమిని మహర్షికి సామవేదం , సుమంతునికి అధర్వణవేదం బోధించిన వాడు వ్యాసుడు . తన కుమారుడు శుకమహర్షికి భాగవతం బోధించాడు . భరధ్వాజుడు ఇంద్రుని వద్ద నుంచీ " ఆయుర్వేదం ” గ్రహించి , ఇతర ఋషులకు దానిని బోధించాడు అని చరక సంహితలో చెప్పబడింది . భరధ్వాజుడు " యంత్ర సర్వస్వం " అనే గ్రంథంలో ఎన్నో రకాలైన యంత్రాల గురించి వివరించాడు.విమాన శాస్త్రం కూడా ఇందులో భాగమే.


Post a Comment

0 Comments

Close Menu