ఫ్రెండ్స్, నటరాజ స్వామి నాట్యంలో దాగిన సృష్టి రహస్యం గురించి ఇక్కడ మీకు తెలియచేస్తున్నాను. చదవండి..
మన భారతీయులు శివుణ్ణి లింగరూపంలో ఆరాధిస్తూ అదే శివుని నటరాజ మూర్తిగా సకల కళానిదేవతగా ఆరాధిస్తారు. మన వారి ఇళ్ళల్లో మాత్రమే కాదు, పాశ్చాత్యుల ఇళ్ళలో కూడా “నటరాజుకొలువై ఉంటాడు. ఈ నృత్య భంగిమ వెనుక సృష్టి రహస్యం దాగి ఉన్నది. ఈ మాట అంటున్నది ఎవరికాదు ప్రఖ్యాత అణుభౌతిక శాస్త్రవేత్త Sir Fritz of Capro. ఇతను తన "Tao of Physics అనే గ్రంధంలో వివరించాడు.(ఈ గ్రంధం Amazon..in లో అముతున్నారు,వీలైతే చదవండి)
ఆధునిక 'క్వాంటమ్ థీరీ' (Quantum Theory) ప్రకారం సృష్టి పరమాణువులతో నిండి ఉంటుంది.
గ్రంథంలో నట రాజు నాట్యంలో దాగి ఉన్న సృష్టిరహస్యం వివరించాడు.
దీనిలో అనంతమైన శక్తి నిండి ఉంటుంది. అవి నిరంతరం ఒక రూపం నుంచి మరొక రూపంలోమారుతూ ఉంటాయి.
పరమాణువులలోని పదార్థం శక్తిగాను, శక్తి, పదార్థంగాను మారుతూ నిరంతరం స్థితిని కోల్పోతుంటాయి.
పరమాణువులలోని ఎలక్ట్రాన్ కణంగాను, మరికొన్నిసార్లు తరంగంగానూ లయబద్ధంగా మారుతూ ఉంటుంది. అందువల్లా ఇది స్థిరం కాదని తేలింది. ప్రతి వస్తువూ పరమాణువుల సముదాయం. పరమాణువుల కదలికలు ఒక లయబద్ద విన్యాసం. ఈ ప్రక్రియ నుంచే చాలా స్థూలమైన, చాలా సూక్ష్మమైన వస్తువులు జనిస్తున్నాయి, మారుతున్నాయి, మరుగవుతున్నాయి.పరమాణువులలోని అణువుల నుంచి నక్షత్ర మండలం వరకూ కల్పప్రళయాల నృత్యహేలగా కనిపిస్తుంది.
ఈ సృష్టి సమస్తం లయాకారంలో ఒక లయబద్ధ కదలికగా కనిపిస్తుంది. ఈ లయబద్ధ కదలికలను నటిరాజ నాట్యంతో పోల్చుకున్నాడు. కాప్రో (CAPRO) అతను ఇలా అంటాడు. “శివతాండవం యొక్కప్రాముఖ్యత మూడు ముఖాలు కలిగినది.
1. శివుని నాట్యమూర్తిలోని వృత్తాకారపు ప్రభ లయబద్ధమైన ఈ జగత్ కదలికకు రూపం,
2. శివనృత్య కారణమేమనగా సర్వమానవుల ముక్తి.
3. భువన కేంద్రమైన 'చిదంబరాన్ని' ఎవరి హృదయంలో వారు ప్రతిష్ఠించుకోవాలన్నది మూడవ ప్రయోజనం.
ఈ శివతాండవతత్వం శాస్త్రానికీ, మతానికీ, కళలకూ సంగమస్థలంగా వెలిసింది. ఇదే శివతత్వం,నటరాజతత్వం సృష్టి యొక్క రహస్యం.


0 Comments