ఫ్రెండ్స్ హిందూ మతం లో అష్టాదశ పురాణాలు చాలా ముఖ్యమైనవి.వాటిలో ఏమున్నవి, ఏదేవుడు గురించి వివరస్తాయో తెలియచేస్తున్నాను.
భారతదేశంలో మానవ జీవితాన్ని ప్రభావితం చేసి, మనిషి నియమబద్ధమైన జీవనం సాగించి,మోక్షమార్గం పొందగలిగే ధర్మసూక్ష్మాలను తెలియజేసేవి పురాణాలు. వేదవిద్య కష్టసాధ్యమైనది.సర్వజనులకు అది అభ్యాస సాధ్యం కాదు. కనుక అందలి విషయాలను, ధర్మాధర్మాలను విపులంగా,సరళంగా, కథల రూపంలో రాజవంశాలను, వారి చరిత్రను పామరజన రంజకంగా వివరించినవి
1. మత్స్యపురాణం: దీనిలో 14,000 శ్లోకాలుంటాయి. మత్స్యావతార రూపంలో విష్ణువు, మనువుకు బోధించినది. మరణించిన పితృదేవతలకు భక్తి శ్రద్ధలతో శ్రాద్ధ విధిని జరపాలని ఉపదేశిస్తున్నది మత్స్యపురాణం.
2. మార్కండేయ పురాణం: ఇందులో 9,000 శ్లోకాలున్నాయి. మార్కండేయ మహర్షిచే చెప్పబడింది.శివ, విష్ణుమహాత్మ్యం, చండీహోమము మొదలైనవి ఇందులో ఉన్నాయి.
3. భాగవత పురాణం: దీనిలో 18,000 శ్లోకాలు కలవు. వేదవ్యాసుడు శుకునకు, శుకుడు పరీక్షిత్మహరాజుకు చెప్పిన విష్ణు అవతారాలు, కృష్ణ చరిత్ర.
4. భవిష్య పురాణం: దీనిలో 14,500 శ్లోకాలున్నాయి. సూర్యభగవానునిచే మనువుకు చెప్పబడింది.వర్ణాశ్రమ ధర్మాలు, భవిష్యత్ సంగతులు ఇందులో ఉన్నాయి.
5. బ్రహ్మపురాణం: ఇందులో 10,000 శ్లోకాలున్నాయి. ధర్మాన్ని రక్షించటం ద్వారా రాజ్యం, స్వర్గం,ఆయువు, కీర్తి, మోక్షం మొదలైనవి సిద్ధిస్తాయని ఈ పురాణం చెబుతుంది.
6. బ్రహ్మాండ పురాణం: ఇందులో 12,000 శ్లోకాలున్నాయి. శ్రీ లలితా సహస్ర నామస్తోత్రాలు,భారతదేశపు భౌగోళిక వర్ణన, ఖగోళ శాస్త్రం ఇందులో ఉన్నాయి.విషయాలు, అతిథి మర్యాదలు ఇందులో ఉన్నాయి.
7.బ్రహ్మ వైవర్త పురాణం: దీనిలో 18,000 శ్లోకాలు కలవు. సృష్టికర్త, సృష్టికి (జగత్తు) సంబంధించినపురాణాలు. వ్యాస భగవానుడు అలా 18 పురాణాలను రచించాడు. వాని వివరాలను సూక్ష్మంగా పరిశీలిద్దాం.
8. వరాహ పురాణం: దీనిలో 24,000 శ్లోకాలున్నాయి. విష్ణు ఆరాధన, వ్రతకల్పాలు, పుణ్యక్షేత్ర వర్ణన ఇందులో ఉన్నవి.
9. వామన పురాణం: దీనిలో 10,000 శ్లోకాలున్నాయి. పులస్త్య మహర్షి నారదునకు ఉపదేశించింది..శివ, విష్ణు, ఆరాధన, భూగోళం, ఋతువర్ణన ఇందులో ఉంది.
10. వాయుపురాణం: ఇందులో 24,000 శ్లోకాలు ఉన్నాయి. ఇది వాయుదేవునిచే చెప్పబడింది. కాలమానం, సౌరమండల వర్ణన ఇందులో ఉంది.
11. విష్ణుపురాణం: ఇందు 23,000 శ్లోకాలున్నాయి. పరాశరుడు తన శిష్యునికి బోధించినది. శివకేశవులమధ్య భేదం లేదని బోధిస్తుంది.
12. అగ్నిపురాణం: దీనిలో 15,400 శ్లోకాలున్నాయి. అగ్నిచే వశిష్టునకు ఉపదేశింపబడింది. దీనిలోవ్యాకరణం, ఛందస్సు, వైద్యం, లౌకిక ధర్మాలు, జ్యోతిష్యం, ఖగోళం వంటి శాస్త్రాలున్నవి.
13. నారద పురాణం: ఇందు 25,000 శ్లోకాలు ఉన్నాయి. నారదుడు నలుగురు బ్రహ్మ మానస పుత్రులకుఉపదేశించింది. శివస్తోత్రం, వేదాంగాలు మొదలైనవి ఇందులో ఉన్నాయి.
14. స్కంద పురాణం: దీనిలో 81,000 శ్లోకాలున్నాయి. ఇది కుమార స్వామిచే చెప్పబడింది.శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం వంటి అనేకమైన వ్రతాలను తెలియజేస్తుంది.
15. లింగపురాణం: దీనిలో శివుని ఉపదేశాలు, శివమహిమ, ఖగోళ, జ్యోతిష్య, భూగోళ శాస్త్రాలు చెప్పబడ్డాయి.
16. గరుడ పురాణం: ఇందులో 19,000 శ్లోకాలున్నాయి. ఇది విష్ణువుచే గరుత్మంతునకు ఉపదేశించబడింది. జనన మరణాలు, పాపపుణ్యాలు స్వర్గ నరకాలు మొదలైనవి గలవు.
17. కూర్మ పురాణం: దీనిలో 17,000 శ్లోకాలు ఉన్నాయి. కూర్మావతారంలో చెప్పబడింది. శివ, విష్ణుఆరాధన, పుణ్యక్షేత్రాల ప్రశస్తి ఇందులో ఉంది.
18. పద్మపురాణం: ఇందులో 85,000 శ్లోకాలున్నాయి. పూజలు, విభూతి,ధర్మము వివరించేది పద్మ పురాణం.
ఇట్లా పురాణాలు సకల మానవ జీవన సౌందర్యం కోసం నేటికీ ఈ దేశంలో ప్రతి గ్రామాలలోనూ, దేవాలయాలలోనూ ప్రవచింపబడుతూ మానవునికి ముక్తి మార్గ పయనావశ్యకతను తెలియజేస్తాయి.
0 Comments