ఫ్రెండ్స్ మన శరీరంలో అతి ముఖ్యమైన కాలేయం పాత్ర ఏమిటో ఇక్కడ తెలియచేస్తున్నాను, చదవండి
శరీరంలో ప్రాణాధారమైన అవయవాల్లో కాలేయం ఒకటి. దీనినే ఇంగ్లీషులో లివరు అంటారు. ఇది పైత్యరసాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది కడుపుపై భాగంలో కుడి వైపున ఉంటుంది. .
శరీరవ్యవస్థను అత్యంత పదిలంగా కాపాడడంలో లివర్ ఒక రక్షకభటుడిలా పనిచేస్తుంది. మనశరీరరానికి కావలసిన ఆక్సిజన్ విస్తారంగా కాలేయ ధమని నుండి వస్తుంది.శరీరంలో ఉండే మెదడు, గుండె, మూత్రపిండాల మాదిరికాకుండా ఈ లివరు ధాతువులకు కొత్త ధాతువులను పుట్టించే శక్తి ఉంటుంది. అందుకే లివరు ఎప్పుడూ నూతన యవ్వనంతో ఉంటుంది.
లివర్ సిరోసిస్ : కాలేయం రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది. కాలేయం రోగాన పడిందంటే అందులో నశించే కణాల స్థానంలో కొత్తకణాలు పుట్టే శక్తి బాగా దెబ్బతింటుంది. నశించిన కణాల స్థానంలో పీచు ధాతువులు ఏర్పడతాయి. ఈరకం పరిస్థితినే 'లివర్ సిరోసిస్' అంటారు.'లివర్ సిరోసిస్' చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఇది వస్తేరోగి త్వరగా అలసిపోతాడు. రోగం ముదురుతుంటే శరీర కండరాలు క్షీణించి పోతాయి. ఆరోగ్యకరమైన కణాలు కొవ్వుతో నిండి అవి మరణిస్తాయి.లివరు తన పనిని చేయలేకపోతుంది.కాలేయం గాయపడితే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకొక్కసారి రోగి నోటినుండి రక్తం పడుతుంది. కాళ్ల వాపు కూడా వస్తుంది. శరీరంలో మొత్తం 639 కండరాలు ఉంటాయి. అన్ని సైజుల్లోకండరాలు రకరకాల ఆకారాల్లో ఉంటాయి. సాధారణ సైజు కండరంలో దాదాపు వంద లక్షల కండరపుపోగులు ఉంటాయి.
కండరాలు - రకాలు : మన శరీరంలోని కండరాలు రెండు రకాలుగా ఉంటాయి. నియంతర కండరాలు,అనియంతర కండరాలు అంటారు. మనం కదిలిస్తే కదిలే కండరాలు మన చేతులు, కాళ్లలో వున్నాయి.వీటిని కదిలించి మనం పనులు చేసుకో గల్గుతున్నాం.మన ఆలోచనలతో నిమిత్తం లేకుండా కదిలే కండరాలు. ఇవి గుండె ఊపిరితిత్తులు, జీర్ణాశయంలోఉంటాయి. కండరాలు కదిలినపుడు లాక్టికామ్లం విడుదలవుతుంది. అందుకే మనం అలసిపోయినట్లు కన్పిస్తాం.లివర్ ధాతువుల ద్వారా రక్తంలోని పోషక మూలకాలను పీల్చుకుంటుంది. వాటిని వేరువేరు రూపాలుగా మార్చి రాగల అవసరాలు తీర్చేందుకు తన వద్ద నిల్వ ఉంచుకుంటుంది. కండరాలు, ఎముకలు,నాడులు మొదలైన ధాతువుల అవసరాలు తీర్చడానికి లివరు ఈ నిల్వలను వినియోగిస్తుంది.అన్నవాహికనుండి వచ్చిన పంచదారను నిలువచేసేందుకు దానిని గ్లూకోజిన్ గా మారుస్తుంది.తరువాత దానిని గ్లూకోజ్ గా మార్చికండరాల ఉపయోగార్థం సరఫరా చేస్తుంది.ఎముకల మజ్జను తయారుచేయడానికి అవసరమైన విటమినులు తయారుచేయడం కూడా దీని కార్యక్రమాలలో ఒక భాగం.
లివరు పనులు: జీర్ణవాహిక నుండి వచ్చే ఎమినో ఆమ్లాలను గ్రహించి వాటిని అల్యుమిన్, గ్లోబ్యులిన్,ఫైబ్రినోజిన్, వంటి ప్రోటీనులుగా మారుస్తుంది.ఇది బైల్ అనే అద్భుత శక్తిగల ద్రవాన్ని తయారుచేస్తుంది. మనం భుజించిన పదార్థాలలోని కొవ్వు పదార్థాలు జీర్ణం అయ్యేందుకు ఈ బైల్ ఉపయోగపడుతుంది. మనం భుజించిన పదార్ధాల మూలంగా ఏర్పడిన విషపదార్థాలవల్ల శరీరానికి హాని జరగకుండా ఒక పోలీసువలె ఇదికాపాడుతుంది. తీసుకునే శరీరానికి సరిపడని మందులు, ఇతర విషాలను ఇదే శరీరంనుండి బహిష్కరిస్తుంది. సాధారణంగా రక్తంలోని ఎర్రకణాలు 120 రోజులు బ్రతికి ఉంటాయి. ఆ తరువాత అవి పగిలి ఐరన్, ప్రోటీన్, బిలూబిన్లుగా విడుదలవుతాయి.ఇందులో ఐరన్, ప్రోటీన్లు శరీరంలోని లివరు, స్క్రీన్, ఎముకల మూలుగులలో నిల్వ ఉండి మళ్లీ కొత్త ఎర్రరక్తకణాల తయారీకి సహాయపడతాయి.పసుపురంగులో ఉండే బిరూబిన్ కారణంగానే మలం పసుపురంగులో విసర్జితం కాబడుతుంది...
లివరు రోగాలు: లివరుకు వచ్చే ఎక్కువ శాతం రోగాలలో లివల్యూస్ ప్రేవుల్లోకి సరిగా పంపబడరు.ఇంకేముంది కళ్లు పసుపురంగులోకి మారతాయి. మూత్రం పసుపురంగుకి వస్తుంది. బి లూబిన్ జేరుకుని అంతేకాదు ఈ బిల్ రూబిన్ కూడా అటుగా పంపిణీ కాదు. దానితో అది రక్తంలో ఉండిపోతుంది.సాధారణంగా రక్తంలో బి లూబిన్ వంద మిల్లీమీటర్లకు 0.2 నుండి 1మి.గ్రా వరకు ఉంటుంది..లివరుకు ఒక విధమైన వైరస్ సోకడం వల్ల పసికర్ల వ్యాధి వస్తుంది. మనం భుజించే క్రొవ్వు పదార్థాలు ప్రేవులనుండి రక్తంలోకి లాగబడాలంటే లివర్ జ్యూస్ అవసరం. పసికర్ల కారణంగా లివర్ జ్యుస్ సరిగా ఉండదు. ఫలితంగా కొవ్వు ప్రేవుల్లోనే ఉండిపోయి మనిషిలో వికారం మొదలవుతుంది..వాంతులు వస్తాయి.
ఈ కారణంగానే పసికర్ల రోగిని నూనె పదార్థాలు వాడవద్దంటారు. లివరు పనులన్ని అందులోఈ ధాతువులన్నీ చుట్టుకుని ఉంటాయి. లివరు గాయపడడం వల్ల కామెర్లు వస్తాయి. దీనిని కెటారు జాండీస్ అంటారు. కాలేయపు కణాలు మంట, వాపుకు గురికావడం వల్ల ఇన్ ఫెక్సియస్ హెపటైటిస్వస్తుంది. దీనినే పచ్చకామెర్లు అంటారు.
రకరకాల కామెర్లు : కామెర్లు రకరకాలుగా ఉంటాయి. పచ్చకామెర్లు కనబడి అందరికీ ఉప్పెనలా అంటుకుంటుంది. తెల్లకామెర్లు ఇలా అంటుకోవు కాని ప్రమాదమైనవి. ఉబ్బుకామెర్లవల్ల శరీరం ఉబ్బుతుంది. ఇది కూడా ప్రమాదమైంది. సాధారణంగా మద్యం సేవించడంవల్ల ఈ ఉబ్బు కామెర్ల వస్తాయి.తాగిన మద్యం శరీరంలో జీర్ణంగాక సరాసరి లివరుకు చేరుకుంటుంది. అచట లివరు ధాతువులను ప్రకోపింపచేస్తుంది.
పసికర్ల వ్యాధి సూక్ష్మక్రిమివల్ల మాత్రమేగాక, ఎక్కవగా మద్యం సేవించడంవల్ల, లివర్ గడ్డలలోను, లివర్ లో రాళ్లు ఏర్పడ్డంవల్ల కూడా వస్తుంది. లివరుకు ఏదైనా రోగం వస్తే పుష్టికరమైన ఆహారం ద్వారా ఈ రోగాన్ని నయం చేసుకోవచ్చు. భుజించే ఆహారంతో పాటు విటమిన్ సి, బి. కాంప్లెక్సు, బి 2 చేరిస్తే లివరు సమర్ధవంతంగా పనిచేయ గలుగుతుంది.
ఈ వ్యాసంలో నేను రాసిన సమాచారం కొంత ప్రాథమిక సమాచారం మాత్రమే. లివరువైద్యానికి దూరం కాకూడదు.అంతా లివరు చెడిందంటే తగిన వైద్యం అందకపోతే మరణానికి చేరువయ్యే ప్రమాదం ఉంటుంది.
ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ నచ్చితే అందరికి షేర్ చేయండి..

0 Comments