Ad Code

Responsive Advertisement

ఇటలీలో పిసాటవర్ ఎందుకు ఒరుగుతోంది?

ఫ్రెండ్స్ ,ఇటలీలో పిసాటవర్ కొన్ని సంవత్సరాలు నుండి ఒరుగుతోంది? కానీ పడిపోవటం లేదు!! ఎందుకో తెలుసా?..!!



ఇటలీలోని పీసా నగరంలో ప్రక్కకు ఒరిగిస అందమైన స్థంభపు మేడ ఉన్నట్లు అందరకూ తెలిసినదే. కానీ అది ఎందుకు ఒరిగినదో చాలామందికి తెలియదు. ప్రతిఏటా కొన్ని వేలమంది యాత్రికులు ఈ వింతను సందర్శిస్తూ ఉంటారు. ఇది తెల్లని పాలరాతితో నిర్మితమైనది. నేలమట్టమున గోడలు నాలుగు మీటర్ల మండాస ఉంటాయి. 55 మీటర్ల ఎత్తయిన ఈ స్థంభములో ఎనిమిది అంతస్థులున్నాయి. పైకి చేరటానికి మూడువందల మెట్లున్నాయి. పైభాగం నుంచి నగర శోభను,పది కి.మీ. దూరంలో నున్న సముద్ర సౌందర్యమును తిలకించవచ్చు. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న కలుగుతుంది. ఏ కారణముచేత ఈ స్థంభపు మేడ ఒరుగుతోంది? ఎందుకు కూలిపోవటం లేదు?

పై భాగము లంబరేఖకు ఐదు మీటర్ల దూరంలో ఉన్నది. అనగా ఐదు మీటర్లు వంగినదన్న మాట.పైనుంచి ఒక బంతిని క్రిందకు విసరిన స్థంభము మొదలుకు ఐదు మీటర్ల దూరంలో పడుతుంది:దీని నిర్మాణం క్రీ.శ. 1174లో మొదలై 1350లో పూర్తయింది. దీని నిర్మాణం ప్రారంభమయినపుడు ప్రక్కకు ఒరుగుతుందని ఎవరూ ఊహించలేదు. మూడవ అంతస్థు పూర్తి అయ్యేనాటికి ప్రక్కకు ఒరగుట ఆరంభించింది. దీనిని గుర్తించి నిర్మాణ పథకము మార్పుచేసి కట్టడము పూర్తి చేశారు.గడచిన వంద సంవత్సరములలో ఈ స్థంభము 30 సెం.మీ. ఒరిగింది.

ఇప్పుడు మరో ప్రశ్న పుడుతుంది. ఇంత ఒరిగినా క్రింద ఎందుకు పడలేదు. విజ్ఞానశాస్త్రప్రకారము భూమ్యాకర్షణ కేంద్రము నుంచి గీయబడిన నిలువుగీత మూలమునుంచి వెళ్ళినట్లయితేఆ వస్తువు స్థిరముగా ఉంటుంది, పడదు. ఈ రోజు వరకు ఈ స్థంభము యొక్క భూమ్యాకర్షని కేంద్రం నుండి వెలువడిన రేఖ స్తంభంలోనే పడుతున్నది.కావున స్తంభం కూలలేదు. ఈ స్థంభము మరికొంత ఒరిగినట్లయితే నేలకూలక తప్పదు.

Post a Comment

0 Comments

Close Menu