ఫ్రెండ్స్,వర్షాన్నిచ్చే మేఘాలు నల్లగా ఎందుకు కనబడతాయో ?తెలుసుకోండి
పర్షాన్నిచ్చే మేఘము లో లెక్కలేనన్ని నీటి చుక్కలుంటాయి. నీటి చుక్కల సంఖ్య ఒక్కోమేఘంలో ఒక్కొక్క విధంగా వుంటాయి. కొన్ని మేఘాలు నల్లగాను మరికొన్ని తెల్లగాను, బూడిద రంగులోను ఎందుకుంటాయి?
ఒక వస్తువు. మీద కాంతి పడినప్పుడు కొంత కాంతిని ఆ వస్తువు గ్రహిస్తుంది. మిగిలినకాంతి పరివర్తనం చెందుతుంది. మెరిసే వస్తువులన్ని సాధారణంగా కాంతిని పరివర్తనం చేస్తాయి.నల్లని వస్తువులు కాంతిని గ్రహిస్తాయి. ఏదేని వస్తువు సూర్యరశ్మిలోని ఏడు రంగులను గ్రహించినట్లయితే అది నల్లగా అగుపిస్తుంది.తమమీద పడుతున్న సూర్యరశ్మిని పరిపర్తనం చేసే మేఘాలన్ని తెల్లగా కనబడుతాయి. .
సూర్యకాంతిని గ్రహించే మేఘాలు నల్లగా కనబడుతాయి. నల్లని మేఘాల్లో నీటి బిందువు లెక్కువగుటచేత అవి సూర్యరశ్మిని ఎక్కువగా గ్రహించే శక్తి కలిగివుంటాయి. అందుచేతనే అవి నల్లగా కనబడుతాయి. ఒక్కోసారి పగటిపూట సయితం కారుమేఘాలు కమ్ముకున్నప్పుడు చీకటి దట్టంగా వ్యాపిస్తుంది. కారణం మేఘాలు సూర్యరశ్మిని గ్రహించి దానిని భూమిని చేరనీయక పోవటమే. ఒక్కొక్కసారి కొన్ని మేఘాలలో మెరుస్తున్న చారలుంటాయి. నిజానికి ఈ మేఘాలు చిన్నచిన్న మంచుకణములతో ఏర్పడి ఆకాశంలో ఎత్తు నవుంటాయి. మంచుకణములు పారదర్శకములు.కావున సూర్యకిరణములు వాటి నుంచి భూమి మీదకు ప్రసరిస్తాయి. అందుచేత అవి తెల్లగా మెరుసాయి.

0 Comments