Ad Code

Responsive Advertisement

అగ్నిలో మండని పదార్ధము ఉందా?

 ఫ్రెండ్స్,అగ్నిలో మండని పదార్ధము ఉందా? అంటే ఉంది..నేను తెలియచేస్తున్న ఈ విషయం చదవండి.



ఏదేని వస్తువును అగ్నిలో వేసినప్పుడు అది కాలి బూడిదవుతుంది. Asbestos మాత్రం అగ్నిలో కాలదు. అందుచేతనే అగ్నిమాపక దళంవారు మంటలనార్పునపుడు జాతినారతో తయారయిన దుస్తులను ధరిస్తారు. వాళ్ల దుస్తులు, బూట్లు, చేతి తొడుగులు,శిరస్త్రాణములు మొదలైననవి ఈ రాతినార తో చెయ్యబడినవే.

'ఆస్బెస్టాస్' అనునది గ్రీకుపడము. 'ఆర్ప సక్యము కానిది' అని దీని అర్థము. ఈ పదార్థాన్ని కొత్తగా కనిపెట్టలేదు. 2000 సం॥లకు పూర్వం రోమనులు మృత కళేబరాలను చెడిపోకుండా వుంచటానికి జాతినార పలకల మధ్య వుంచేవారు.రాతినార గనులలో లభ్యమవుతుంది. ఒలిలైన్ నుంచి విడిపోయి ఇది ఏర్పడుతుంది.కాల్షియము, మెగ్నిషియముల సిలికేట్ల రూపమే ఒలిలైన్. గనులలో జరిగే రసాయనిక చర్యల వలన ఒలిలైన్ జాతినార' (Asbestos) గా మారుతుంది. గసులలో లభించిన జాతినారను యంత్రముల ద్వారా విడదీస్తారు. దీని ఫైబరు నుంచి దారములను, త్రాళ్లను తయారు చేస్తారు.ఆ తరువాత వాటిని దుస్తులు మొ॥న వస్తువులు తయారు చెయ్యటానికి ఉపయోగిస్తారు. ఇది చాలా ఉపయోగకరమైనది. దీనిని నిప్పు అంటని దుస్తులు, పేపరు తయారు చెయ్యటానికి, ఫర్నేసులలోను ఎక్కువగా ఉపయోగిస్తారు. చలిదేశాలలో దీనిని నీళ్ళ పైపులకు పూత పూస్తారు. దీని వలన పైపులలోని నీళ్ళు గడ్డకట్టిపోకుండా వుంటాయి. రబ్బరు, ప్లాస్టరు మొదలైనవాటి తయారీలోను దీనిని వాడతారు.రాతినారలో ఉష్ణము, విద్యుచ్ఛక్తి ప్రవహించవు. ఆమ్లములు మొదలైన వాటి ప్రభావం వల్ల చెడిపోదు. 20000 సెం.గ్రే. నుండి 30000 సెం.గ్రే. వరకు వేడి చేసినా తగులబడదు. 50000సెం.గ్రే. వద్ద కూడా మండని ప్రత్యేక రకపు రాతినార ఇప్పుడు లభిస్తోంది. దీనిని ప్రయోగశాలల్లో వినియోగిస్తారు. ప్రపంచంలో లభించే మొత్తం రాతినారలో 75% కెనడాలో లభిస్తుంది. దీని నుంచి ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేస్తుంది అమెరికా.


Post a Comment

0 Comments

Close Menu