Ad Code

Responsive Advertisement

భూమ్యాకర్షణ శక్తి ఒక మిస్టరీ!!

ఫ్రెండ్స్ మనం నివసించే భూమి యొక్క భూమ్యాకర్షణ శక్తిపై ఎన్నో సందేహాలు ఉన్నాయి.వాటికి సమాధానాలు దొరికితే కోన్నీ కొత్త విషయాలు కనుగోనబడతాయి.ఈ లాంటి విషయాలు కొన్ని మీకు తెలియచేస్తున్నాను. చదవండి..



మూడు వందల సంవత్సరాల క్రితం న్యూటన్ కనుగొన్న 'భూమ్యాకర్షణ శక్తి' నేటికీ పరిశోధనాంశంగానే ఉంది. అసలు ఈ శక్తి ఎలా పనిచేస్తున్నది? అనే విషయం ఇప్పటికి రహస్యంగానేఉండిపోయింది. భూమ్యాకర్షణ శక్తిలేని ప్రాంతాలలో మొక్కలు పెంచారు. అవి వంకరలు తిరిగి తమ స్వరూపానికి భిన్నంగా తయారయ్యాయి. ఇటువంటి ప్రదేశాలలో శాస్త్రవేత్తలు వున్నారు. వారు అనారోగ్యానికి గురయ్యారు. కోడిగ్రుడ్ల గర్భపిండాలు ఈ ప్రదేశాలలో చచ్చిపోయాయి.

భూమ్యాకర్షణశక్తి రహస్యాన్ని ఛేదించగలిగితే మనుషులు గాల్లో ఎగిరే విధానాలు రూపొందించ వచ్చంటున్నారు. చేజారిన ప్రతి వస్తువు భూమి మీద పడుతుంది. కారణం భూమ్యాకర్షణ బలం అంటున్నారు.. .సామాన్యుడికి కూడా ఈ భూమ్యాకర్షణ బలానికి సంబంధించి ఎన్నెన్నో అనుమానాలు ఉన్నాయి. కాలం గడుస్తూ ఉంటే రేడియో ధార్మిక పదార్థాల రేడియో ధార్మికత క్షీణించిపోతుంది. అదేవిధంగా కాలంలోపాటు భూమ్యాకర్షణ శక్తి క్షీణిస్తుందా?భూమి సంకోచిస్తూ దాన్ని వ్యాసార్థం తగ్గిపోతే భూమ్యాకర్షణ బలంపై దాని ప్రభావం వుంటుందా? భూకేంద్రం వద్ద ఎంతుంటుంది? అసలు భూమ్యాకర్షణ శక్తి నిజంగా ఉందా? భూమ్యాకర్షణ శక్తి మారితే దాని ప్రభావం మనిషి శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థపై ఏ విధంగాఉంటుంది?వస్తువులన్నీ భూమ్యాకర్షణ బలానికి కిందపడుతూ ఉంటే మంటసాగదీసిన ఆకృతిలో పైకి ఉంటుందేమిటి?

శక్తి క్షీణించదు : పదార్థ నిర్మాణంలో ఉండే అస్థిరతవల్ల రేడియో ధార్మిక పదార్థాలలో రేడియో ధార్మికత
లక్షణం క్షీణిస్తుంది. భూమ్యాకర్షణ శక్తి అనేది భూమి అస్థిరతవల్ల వచ్చినది కాదు. భూమి ఉన్నంతకాలం,
దానికి ద్రవ్యరాశి వున్నంతకాలం భూమ్యాకర్షణ శక్తి ఉంటుంది. ఇది నిజంగా ఉంది.
భూమి ద్రవ్యరాశి స్థిరంగా ఉండి దాని వ్యాసార్థం తగ్గితే అప్పుడు భూమి మీద వున్న వస్తువుకు
భూకేంద్రానికి మధ్యన వున్న దూరం తగ్గిపోతుంది. వీటి మధ్యదూరం తగ్గితే భూమ్యాకర్షణబలం పెరుగుతుంది.
భూమికేంద్రం వద్ద వస్తువును ఉంచితే దీనికి ఒకవైపుగల భూమి ద్రవ్యరాశి దానిపై కలిగించే
ఆకర్షణ బలాన్ని రెండువవైపు గల భూమి ద్రవ్యరాశి దానిపై కలిగించే ఆకర్షణబలం రద్దుచేస్తుంది.
అందువల్ల భూకేంద్రం వద్ద వుంచిన వస్తువుపై ఎటువంటి భూమ్యాకర్షణ బలం ఉండదు.
రక్తప్రసరణ : మన శరీరంలో రక్తప్రసరణ నిరంతరం జరిగేందుకు రక్తాన్ని గుండె పంపుచేస్తూ ఉంటుంది.
ఈ గుండె పనితీరు నీటి పంపుమాదిరి ఉంటుంది. భూమ్యాకర్షణ బలానికి వ్యతిరేకంగా ఇది పనిచేయాలి.భూమ్యాకర్షణ బలం తగ్గితే గుండెపని తగ్గుతుంది. అందువల్ల శరీరంలో రక్తపోటు తగ్గుతుంది.
మంట ఎందుకు అలా ఉంటుంది? : భూమ్యాకర్షణ బలం కారణంగానే మంట సాగదీసిన ఆకృతిలో పైకి ఉంటుంది. ఉదాహరణకు కొవ్వొత్తిని వెలిగించాం అనుకుందాం. దానిలోని కార్బన్, హైడ్రోజన్లు గాలిలోని ఆక్సిజన్ తో కలిసి కార్బన్ డై ఆక్సైడ్, నీటి ఆవిరి ఏర్పడతాయి.దహనానికి గాలి అవసరం. అందుకే మంట వెలుపలి అంచుల్లోనే దహనం జరుగుతుంది. 
  ఈ దహనంవల్ల ఏర్పడిన వాయువులు వేడిగా ఉంటాయి. వ్యాకోచం చెందుతాయి. పరిసరాల్లో ఉన్న వాయువులు కన్నా తేలిగ్గా తయారవుతాయి. తేలిగ్గావున్న ఈ వేడివాయువులు పైకి వెళ్లిపోతాయి.
వొత్తికింది భాగంలోకి చల్లనిగాలి వచ్చిచేరే అవకాశం ఉంటుంది. వేడి వాయువులు ఇలా పైకపోతూ ఉండటంవల్ల మంట సాగదీసిన ఆకృతిలో పైకి ఉంటుంది..

భూమ్యాకర్షణ లేనిప్రాంతంలో కొవ్వొత్తిని వెలిగిస్తే దాని మంట గోళాకారంగా తయారవుతుంది...
ఎందుకంటే తయారయిన వేడివాయువులు ఎటువైపునకు వెళ్ళక వొత్తి సమీపంలో మంటచుట్టూ ఉంటాయి...క్రమంగా ఈ వేడివాయువుల పీడనం పెరిగి మంట గోళాకారంగా ఉండేటట్లు చేస్తాయి.
బంతిమాదిరి గోళాకారంగా మండుతూ ఉంటుంది.
భూమ్యాకర్షణ పరిధి దాటిన అంతరిక్ష నౌకలో కొవ్వొత్తిని వెలిగిస్తే దానిమంట గోళాకృతిలో కన్పిస్తుంది.
ప్రకృతి బలాలు : ప్రకృతిలో నాలుగు రకాల బలాలు మాత్రమే ఉన్నాయి. అవి గురుత్వాకర్షణ బలు
(మనకు భూమ్యాకర్షణ బలం), విద్యుదయస్కాంత బలం, బలమైన కేంద్రకబలాలు, బలహీనమైన
కేంద్రకబలాలు, ఈ నాలుగు బలాలు నిజానికి ఒక బలానికి చెందిన వివిధ రూపాలని రుజువు చేయడానికి ఐన్ స్టీన్ దశాబ్దాల పాటు కృషిచేసి విఫలుడయ్యాడు.
ముఖ్యంగా గురుత్వాకర్షణ బలం, విద్యుదయస్కాంత బలం ఒకే బలానికి చెందిన విభిన్న రూపాలని నిరూపించాలని ఐన్ స్టీన్ విశ్వప్రయత్నం చేశాడు. అయితే విద్యుదయస్కాంత బలం, బలహీనమైన కేంద్రకబలం ఒకే బలానికి చెందిన భిన్నరూపాలని అబ్దూస్ సలామ్ నిరూపించగలిగాడు.
దీనితో ప్రకృతిలో మనకు తారసపడే నాలుగు బలాలు ఇప్పుడు మూడు రకాల బలాలుగా ఐక్యత చెందాయి. ఈ ఐక్యత సిద్ధాంతాన్ని పాకిస్తాన్‌కు చెందిన సలామ్ తో పాటు అమెరికా సంయుక్త రాష్ట్రాలకు
చెందిన షెల్డెన్ గ్లాసో, స్టీవెన్ బర్గులు సంయుక్తంగా ప్రతిపాదించారు. వీరి కృషికి 1979లో నోబెల్
బహుమానం లభించింది.కొంతమంది శాస్త్రవేత్తలు ఆస్ట్రేలియా గనుల్లో గురుత్వాకర్షణకు సంబంధించిన కొన్ని ప్రయోగాలు చేశారు. గనుల లోపలి పొరల్లో 'యాంటీ గ్రావిటీ ఫోర్స్'తో గురుత్వాకర్షణ శక్తిని అంచనా వేసేందుకు ప్రయత్నించారు. వీరి ఫలితాలు కొంత ఆశాజనకంగా ఉన్నా పరిశోధనలు ఇంకా జరగాల్సి ఉందని ఇతరులు
అంటున్నారు.

ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ నచ్చితే అందరికి షేర్ చేయండి..









Post a Comment

0 Comments

Close Menu