Ad Code

Responsive Advertisement

అతిగా ఎక్స్ రే లు మంచిది కాదు,హానికరం!

ఫ్రెండ్స్,ఆతిగా ఎక్స్ రేలు తీయించుకోవడం మంచిది కాదు,హానికరం! చదవండి..



మనిషి శరీరంలోని అంతరభాగాలు విస్పష్టంగా కళ్లముందు సాక్షాత్కరించింది.,ఎక్స్ కిరణాలఆవిష్కరణతోనే. మృతదేహాలపై అనేక పరిశోధనలు చేసిన విసేలియస్ 1543లో శరీర నిర్మాణం గుట్టు విప్పినా ఎక్స్-కిరణాలు కనుగొనే వరకూ ఖచ్చితమైన రోగనిర్ధారణ విధానాలు అభివృద్ధి చెందలేదు.1895లో జర్మనీకి చెందిన విల్ హెమ్ కాంజన్ ఎక్సు కిరణాలను గుర్తించి మానవాళికి మహోపకారం చేశాడు. క్రూక్స్ ట్యూలో కాథోడ్ కిరణాలపై పరిశోధనలు సాగిస్తూ ఉండగా యాదృచ్ఛికంగాఎ క్స్- కిరణాలను గుర్తించాడు. క్రూక్స్ ట్యూబ్ చుట్టూ నల్లటి కార్డు బోర్డు చుట్టి రెండు ఎలక్ట్రోడ్స్ మధ్య శక్తివంతమైన విద్యుత్ ను  ప్ర సరింపచేశాడు.ట్యూబ్ కు కొన్ని అడుగుల దూరంలోగల బేరియం ప్లాటినో సయనైడ్ ప్లేటు ప్రతిదీప్తి చెందుతూ మెరిసింది. ఈ సంఘటన ఎంతో ఆశ్చర్యం కలిగించింది.ఈ ప్రతిదీప్తికి కారణమని రాంజన్ గుర్తించాడు. ఈ అజ్ఞాత కిరణాలకు ఎక్స్ కిరణాలని పేరు పెట్టారు. వీటిపై పరిశోధనలు మరింత వేగవంతం చేశారు.

స్వభావం : ఎరేలు (కిరణాలు) విద్యుదయస్కాంత వర్ణపటంలో భాగమని గుర్తించారు. వస్తువులగుండా ఈ ఎక్స్ రేలకు చొచ్చుకుపోయే స్వభావం ఆధారంగా ఎక్స్ రే ఇమేజింగ్ పద్ధతి మొదలయ్యింది.రాంజన్ తొలిసారిగా తన భార్య చేతి పైకి ఎక్స్ కిరణాలను ప్రసరింపజేసి చరిత్రలో తొలి ఎక్సరే ఛాయాచిత్రాన్ని 1896లో తీశాడు. ఈ ఛాయా చిత్రంలో ఎముకల నిర్మాణం, చేతికి వున్న ఉంగరం స్పష్టంగా కన్పించాయి. దీనితో ఎక్స్ కిరణాలతో ఫోటోలు తీసి శరీరం లోపలి భాగాలు స్పష్టంగా చూడవచ్చని,రోగనిర్ధారణకు ఈ చిత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయనీ యావత్ ప్రపంచానికి తెలిసింది.

 జీవితాంతం ఎక్స్ కిరణాలపై పరిశోధన చేసిన రాంట్‌జన్ వాటి దుష్ప్రభావం వల్లనే 1923లో మరణించాడు. ఆ తరువాత ఎక్స్ కిరణాల ఉత్పత్తికి కూలి అనే శాస్త్రవేత్త ఒక పరికరాన్ని రూపొందించాడు.అది కూలి పరికరంగా ప్రసిద్ధి పొందింది.ఎక్స్ రే ఇమేజింగ్ పరిణామక్రమంలో సి.టి.స్కాన్, సోనోగ్రఫీ, ఎన్.ఎమ్.ఆర్,థర్మోగ్రఫీలో వాడుకలోకి వచ్చాయి.

ఎక్స్ రేలతో ఎదురయ్యే హాని : ఏరకమైన పంటి జబ్బు వచ్చినా వెంటనే దంతవైద్యుని వద్దకు వెళ్లడం తప్పనిసరౌతుంది. చాలా మంది దంతవైద్యులు అవసరం వున్నా లేకపోయినా రోగులను ఎక్స్ రే తీయించుకు రావలసిందిగా సలహాలు ఇస్తారనీ, దీనివల్ల జరుగుతున్న హాని అధికంగా ఉందనీ బ్రిటిష్ ఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఏడువేలమంది డెంటిస్టుల పై పరిశీలనలు జరిపిన బ్రిటీష్ ఆరోగ్యశాఖ,చాలామంది డెంటిస్టులకు ఎక్స్ రే యంత్రాలు పనిచేసే తీరు తెన్నుల గురించి కూడా తెలియదని ప్రకటించింది.


ఎక్స్ రే యంత్రాల ముందుకు పలుమార్లు రావడంవల్ల మేలుకన్నా కీడే అధికంగా జరుగుతోంది. ఎక్స్ కిరణాలు అవసరానికి మించి ఎక్కువ భాగం నోటిపై ప్రసారమౌతున్నాయి. దీనివల్ల థైరాయిడ్ గ్రంథి వంటి సున్నిత అవయవాలు దెబ్బతింటున్నాయి.

పదేపదే ఎక్స్ రేలు వద్దు : ఎక్స్ కిరణాలు ఒకరకంగా అయన కరణ వికిరణాలు. విచక్షణారహితంగా

వీటిని వినియోగిస్తే మానవులకు హానికరం. అణుబాంబు విస్ఫోటనం చెందినపుడు వెలువడే అయనీకరణ వికిరణం అంత అయనీకరణ ప్రభావం ఈ ఎక్స్ కిరణాలకు ఉంటుంది.

సరైన మోతాదులో ఎక్స్ కిరణాలను శరీరంమీద ప్రయోగించినపుడు కూడా అవి శరీరంలోకి చొచ్చుకుపోయి మంచి కణాలు కూడా కొన్ని నాశనం అవుతాయి. అయితే ఈ ఎక్స్ కిరణాల స్థాయి తక్కువగా ఉండడంవల్ల నాశనం అయిన కణాలు తిరిగి పునరుత్పత్తి అవుతాయి.

అందువల్ల ప్రయోగించాల్సిన ఎక్స్ కిరణాల గురించిటెక్నీషియను క్షుణ్ణంగా తెలియాల్సి ఉంది.

ఈ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకోవాలి.పదేపదే ఎక్స్ కిరణాలు శరీరం మీద పడడంవల్ల కణాలు నాశనం కావడానికి బదులు అవిక్రమరహితంగా పెరిగేందుకు ప్రేరణ పొందుతాయి. చివరకు కాన్సర్‌గా తయారు కావచ్చు.

మనిషి శరీరాన్ని వదలిన ఎక్స్ కిరణాలు గదిని వదలక ఆ గది ఎక్స్ కిరణాల వికిరణాలతో అయనీకరణం చెంది ఉంటుంది. ఎక్స్ రేలు తీసే గదిలోకి గాలి ప్రసారం బాగా ఉండకపోతే ఈ గదిలోని ఆయనీకరణం తారాస్థాయికి చేరుతుంది.దానివల్ల గదిలో ప్రవేశించే టెక్నీషియన్స్, రోగి మరియు విజిటర్స్ కు ఎంతో హాని జరుగుతుంది.

అంతేకాదు ఈ గది గోడల ద్వారా ఎక్స్ కిరణాలు బయటకు జారుకుని చుట్టుపక్కల ప్రదేశాలు, భవనాల్లోకి ప్రవేశించవచ్చు. ఫలితంగా ఆ భవనాల్లో నివసించే వారి పై దుష్ప్రభావాలు మొదలౌతాయి. తల్లి కడుపులోని గర్భస్థ శిశువుపై వీటి ప్రభావం ఉంటుంది. శిశువు వికృతంగా ఎదిగి మెదడుకి హానికలగవచ్చు. అందువల్ల గర్భవతులకు ఎక్స్ రేలుతీసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.ఎక్స్ రే యంత్రాలు సరిగా పనిచేస్తున్నాయో లేదో తరచు సరిచూసుకోవాలి. ఇవ్వాల్సిన మోతాదుకుమించిన మోతాదులో ఎక్స్ కిరణాలు విడుదలవుతున్నాయేమో చెక్ చేసుకోవాలి..


Post a Comment

0 Comments

Close Menu