ఆభరణాలు వద్దనే ఆడవారు వుండరు వీరి అభిరుచులకు తగ్గట్టు బంగారు నగలు చేయించాలందే, వాళ్ళ మగవాళ్ళనందర్నీ లాకట్టు పెట్టినా రావు.ఇంట్లో అందమైన సామాన్లు వుండాలని కోరుకునేవారు ఎంతోమంది వున్నారు.ఈ పరిస్థితుల్లో వెండి ఆభరాణాలే శరణ్యం. వెండి ఆభరణాలు తమ సొగసుల్నిఎంతోకాలం వుంచుకోలేవు. కొన్ని రోజుల తర్వాత అవి నల్లబడిపోవటంజరుగుతుంది, ఈ వెండి ఆభరణాలు ఎందుకు నల్లబడుతాయి. వాటికి పట్టినచిలుమును ఏవిధంగా వదలించుకోవచ్చు.వెండి అనేది తళతళా మెరినే లోహం ఆక్సిజన్ తో ఈ లోహం చర్యకులోనవుతుంది. ఆక్సైడ్ పొర లోహంమీద ఏర్పడుతుంది. గాలిలో వున్న సల్ఫర్ వెండిలో కలిసిపోయి నల్లటిపూతగా ఏర్పడుతుంది. దానివల్ల సిల్వర్ ఆక్సైడ్ గా మారుతుంది. ఈ విధంగా ఏర్పడటానికి అసలైన నేరస్థుడు హైడ్రోజన్ సల్ఫైడ్కాలుష్యం వల్ల గాలిలో ఏర్పడిన హైడ్రోజన్ సల్ఫైడ్, ఆక్సిజన్ ఎదుటసిల్వర్ తో చర్య జరుపుతుంది. దీనివల్ల చిలుము ఏర్పడుతుంది. తోమటంవల్లనల్లటి పూతను వదలించుకోవచ్చు. దానితోపాటు పై చర్యకు గురికాని వెండికూడా పోతుంది. ఆమోనియా లేక థియేరియా రసాయనాల వల్ల కూడాఈ చిలుమును పోగొట్టవచ్చు. ఉప్పు లేదా సోడా నీటిలోగాని వేసి వేడిచేయటవల్ల కూడా చిలుమును వదిలించుకోవచ్చు, ఎలక్ట్రో కెమికల్ పద్ధతివల్ల సిల్వర్సల్ఫైడ్ ను తొలగించవచ్చు. పదిశాతం గల ఎక్వియస్ మోర్ ఫోలిన్ ద్రవంలోముంచితే ఈ చిలుము పట్టకుండా కాపాడుకోవచ్చు.

0 Comments