పక్షులు ఆకాశంలో విహరిస్తూ వుంటే చిన్నతనంలో ఎంతో ఆసక్తిగాచూనేవాళ్ళం. ఎండాకాలం వచ్చిందంటే వేసవి సెలవుల్లో ఊరికి వెళ్ళి హాయిగావనంలో కాలం గడిపేవాళ్ళం. రకారకాల రంగుల పక్షులు, తోటంతో విభిన్న కూతలతో మారు మోగేది. మామిడి చెట్లమీద రామచిలుక హొయలుపోతూ వుండేది. పక్షులకు ప్రత్యేకమైన రెక్కల అమరిక వుండటంతో స్వేచ్ఛగానింగిలో ఎగురుతూ కాలం గడుపుతాయి. మొట్టమొదట రెక్కలు కట్టుకొనిమనిషి పైకి ఎగరటానికి ప్రయత్నించాడు. వీలు లేకపోయింది. రైట్ సోదరులుఅతి శ్రమలకోర్చి ఎన్నో రోజుల క్రిందట, వివిధ రకాల రెక్కలు వాటి కమర్చిపైకెగరటం ఎట్లో తెలియజేశారు. ఇప్పుడు ఎయిరోనాటిక్స్ అనే కోర్సుదీనికోసం నిర్వహించబడుతోంది. ఈ మధ్య బెటన్ ఆధారంగా విహరించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. విమానం నుండి పారాచూట్ సాయంతోక్రిందికి దిగటం మొదలైన ప్రక్రియలు చూడటానికి ఎంతో ఆసక్తికరంగావుంటాయి.
హెలికేస్టర్ , విమానాలు పైకి ఎగురగలవు, కారణం.వాటి నిర్మాణంలోప్రత్యేక మైన తిరిగే బ్లేడులు, రెక్కలు కలిగివుండటమే. వాటి రెక్కలనుగానీ,బ్లేడులనుగానీ పరిశీలిస్తే, క్రింది బ్లేడు లేక రెక్కలు కాస్త వక్రంగానో, సమతలంగానో వుంటాయి పైవాటికన్నా మరో రకం బ్లేడులు రెక్కల నిర్మాణంలోకొంచెం తేడా కనిపిస్తుంది. ఈ రెండు రకాల రెక్కలు ఒక్కోరకం నిర్మాణంకలిగియుంటాయి. ఈవిధంగా వుండటంవల్ల గాలికి పైభాగాన ఎక్కువ వడివుంటుంది. లోపలి భాగం కన్నా, గాలిపీడనం బ్లేడు లేక రెక్క పైభాగానతక్కువ వుంటుంది. క్రిందికి నెట్టబడుతున్న గాలిపీడనం బ్లేడు లేక రెక్కనుపైకి తోస్తుంది. విమానం ముందుగా క్రింద పరిగెడుతూ పైకి వెళుతుందిహెలికేస్టర్ లో అయితే రోటార్ కున్న బ్లేడులు తిరుగగానే పైకి లేస్తుంది. ఒకనిర్ణీత రోటార్ వడిలో వెలుతున్న హెలికేస్టర్ బరువును పై ఆధిబలం, క్రిందిఅభిబలాలు సరితూగేటట్లు చేస్తాయి. ఈ పరిస్థితుల్లో హెలికేస్టర్ ఆకాశంలోనిలకడగా వుండగలదు, హెలికేష్టర్ పైకిగానీ, క్రిందికిగానీ ఎగుర గలదు.ఈ చర్య ముఖ్యంగా రోటార్ బ్లేడులు తిరిగే వడి పైన ఆధారపడి వుంటుంది. !విమానంకు అతికింపబడి, కదలలేని నిశ్చలమైన రెక్కల అమరిక వుంటుందిఇది పైకి ఎగరాలంటే ఎక్కువ వేగంతో ముందుకు పరిగెత్తాలి కాబట్టి విమానంనిలకడగా వుండటానికి అవకాశం లేదు.


0 Comments