వర్షం పడేటప్పుడు వాహనం బయటి వాతావరణం చల్లగా ఉంటుంది. లోపలి వాతావరణం కొంచెం వేడిగా ఉంటుంది. అలాగే వర్షం పడే వేళల్లో లోపలా బయటా గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది.
వర్షం వలన వాహనం యొక్క అద్దం చల్లబడిపోతుంది. ఎప్పుడైతే కాస్త గుబురుగా ఉన్న గాలి ఈ చల్లని ఉపరితలం మీదుకు వస్తుందో అప్పుడు అది బాష్పీభవనం (condensation) చెంది పుగమంచులా అద్దం లోపలి వైపు పెరుకుపోతుంది. అందుకే వర్షం పడేటప్పుడు బయటి వైపు వైపర్ పనిచేస్తున్నప్పటికీ లోపల మాత్రం అద్దాన్ని తరచుగా తుడుస్తూ ఉండాలి.
ఈ సమస్య ఎక్కువగా బస్సులలో, లారీలలో, వ్యానులలో, పాతకాలం కార్లలో ఎక్కువుగా కనిపిస్తుంది.
ఇప్పడు వచ్చే కార్లు అన్నింటిలోను ఈ సమస్యను అధిగమించడానికి డి-ఫ్రోష్టింగ్ సాంకేతికత ఉంటుంది. దీనివల్ల అద్దం లోపలి వైపు పొగమంచు పట్టకుండా ఉంటుంది. ఈ డి-ఫ్రొస్టర్లు రెండు ఉంటాయి. ఒకటి కారు ముందటి అద్దం దగ్గర ఉంటే, ఇంకొకటి కారు వెనకటి అద్దం వద్ద ఉంటుంది.
పై చిత్రం : కార్ ముందటి అద్దం వద్దనున్న గాడుల్లోనుండి వేడి గాలి వస్తుంది.
ముందటి అద్దం వద్దనైతే స్విచ్ నొక్కగానే 'వేడి గాలి' ఆ చల్లబడిన అద్దం మీదకు వదులబడుతుంది. దానితో ఆ ఉపరితలం కాస్త వేడెక్కి బష్పిభవనం జరగకుండా ఉంటుంది.
పై చిత్రం : వెనకటి అద్దం మీద కనిపించే గీతలు డి-ఫ్రోష్టింగ్ సర్క్యూట్ కి సంబందించినవి.
అదే వెనకటి అద్దం వద్దనైతే, చిన్న ఎలక్ట్రిక్ సర్క్యూట్ అద్దానికి అతికిస్తారు. స్విచ్ నొక్కగానే ఆ సర్క్యూట్ వేడెక్కి, ఆ అద్దం ఉపరితలాన్ని కూడా వేడిగా చేస్తుంది. దాంతో అక్కడ కూడా పొగ మంచుపట్టదు.
ఇలా తరచుగా తుడిచే పని లేకుండా డి-ఫ్రోస్టర్లు సాహాయపడతాయి.
0 Comments