టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లో మీరు పాలసీ కోసం కట్టిన ప్రీమియం ఎట్టి పరిస్థితులలో కూడా తిరిగి రాదు . చాలా మంది కేవలం వారు కట్టిన ప్రీమియం తిరిగి రావడం లేదనే కారణంతో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల వైపు చూడటం లేదు . మీరు దేనికైనా మనీ చెల్లిస్తున్నప్పుడు , మీ మనీ తిరిగి రాకుంటే దానికి విలువ లేదు , అని భావించడం చాలా తప్పు . ఒక వేళ మీరు కట్టిన మనీ పాలసీ గడువు తర్వాత తిరిగి వచ్చిన దాని విలువ చాలా తక్కువగా ఉంటుంది . మీరు కట్టిన ప్రీమియం తిరిగి రావడం వలన ఉపయోగం ఏమిటి ? మీరు ప్రతి సంవత్సరం పదివేల రూపాయల ఇన్సూరెన్స్ ప్రీమియం కడితే , ముప్పై సంవత్సరాల తర్వాత మూడు లక్షల అవుతుంది . ముప్పై ఏళ్ళ తర్వాత మీరు అందుకునే ఈ మూడు లక్షలకు ఎంత విలువ ఉంటుదో ఒక్కసారి లెక్కించండి . ఇప్పుడు మీకు నెలవారీ ఖర్చుల కోసం కనీసం రూ.40000 అవుతుంది అనుకుంటే , ముప్పై ఏళ్ళ తర్వాత ఇదే జీవితం గడపడానికి నెలకు సుమారు రూ.3,00,000 అవసరం అవుతుంది . అంటే ఒకవేళ మీరు కట్టిన ప్రీమియం మీకు తిరిగి చెల్లించిన అది మీ ఒక్కనెల ఖర్చులకు కూడా సరిపోదు . ఆ మాత్రం మనీ కోసం ఆశపడి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోకుండా ఉంటారా ! మీరు కనుక మీకు సరిపడా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోలేదంటే . మీరు , మీ ఫ్యామిలీ కొరకు సరైనా జాగ్రత్త తీసుకోనట్టే . మీరు ఎప్పుడు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయడం వలన ఎంత నష్టం వస్తుంది అని ఆలోచించకుండా దాని వలన కలిగే లాభాల గురించి మాత్రమే ఆలోచించండి . ఎవరైనా సరే నిండు నూరేళ్ళు బ్రతకాలని కోరుకుంటాం అనుకొని సంఘటనలు సంభవించడం కూడా జీవితంలో భాగమే . మీరు చెల్లించే కొద్ది మొత్తం మనీ వలన మీ కుటుంబానికి రేపు అనుకొని సంఘటనలు జరిగినప్పుడు ఎంతో రక్షణగా ఉంటుంది . అంతే కాదు మీకు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది .
ఎప్పుడైతే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఎప్పుడైతే ప్రజాదరణ పొందడం మొదలుపెట్టాయో వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీలు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటే కూడా ప్రీమియం తిరిగి చెల్లించే విధంగా పాలసీలు రూపొందించ బడ్డాయి . కాని ఈ పాలసీలు తీసుకోవడానికి ప్రీమియం ఎక్కువగా చెల్లించవలసి వస్తుంది . పాలసీ కాలపరిమితి తర్వాత మీరు జీవించి ఉన్నట్టు ఐతే , మీ ప్రీమియం తిరిగి చెల్లిస్తారు . మీరు సాదారణంగా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ యాబై లక్షలకు తీసుకొంటే సంవత్సరానికి సుమారు ఎనిమిది వేలు చెల్లిస్తే సరిపోతుంది . అదే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం తిరిగి వచ్చేలా తీసుకుంటే యాభై లక్షల రూపాయలకు మీరు సుమారు రూ .15,000 / - చెల్లించవలసి వస్తుంది . ఈ పదిహేను వేలలో ఎనిమిది వేలు ఇన్సూరెన్స్ కొరకు పోగా మిగిలిన 7,000 / ఇన్వెస్ట్ చేస్తారు . ఈ విధంగా ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై కేవలం సుమారు 6 % వరకు మాత్రమే రాబడి అందచేస్తారు . బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేసిన వడ్డీ సుమారు 8 % పైన వస్తుంది . ఇన్వెస్ట్ చేయగా వచ్చిన రాబడి ద్వారా మీకు ప్రీమియం తిరిగి చెల్లిస్తారు . దాని బదులు మీరు అదే ఏడు వేలను మ్యుచవల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు అందుకోవచ్చు . ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ అందించడం కొరకు ఏర్పడ్డాయి . అంతే కాని ఇన్వెస్ట్మెంట్ కొరకు కాదు అనే విషయం మీరు తెలుసుకోవాలి . మ్యుచవల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ కొరకు ఏర్పడ్డాయి . కాబట్టి మీకు లైఫ్ ఇన్సూరెన్స్ కావాలి అంటే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి . అంతేకాని ప్రీమియం తిరిగి చెల్లించే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవద్దు . వీటి కొరకు అధిక ప్రీమియం చెల్లించాలి .
0 Comments