Ad Code

Responsive Advertisement

హౌసింగ్ లోన్ తీసుకొనే ముందు చూసుకోవాలిసిన ముఖ్య విషయాలు ఇవే..

  సాధారణంగా బ్యాంకులు మీకు లోన్ ఇవ్వడానికి ముందు మీ ఇంటి ఖర్చులు , మీరు ఇతర లోన్స్ కోసం చెల్లిస్తున్న EMI లను కూడా లెక్కలోకి తీసుకుంటాయి . ఒక వ్యక్తి ఎంత మొత్తం లోను పొందగలడనేది ఆ వ్యక్తీ వయస్సు , ఎంత డౌన్ పేమెంట్ చెల్లించగలరు , మీకు గల ఇతర అప్పులు , మీ ఆదాయం మొదలగు వాటిని పరిగణలోకి తీసుకొని మీరు ఎంత లోనుకి అర్హత గలదో నిర్ణయిస్తాయి . మీ నెల వారి ఆదాయం , మీ ఇతర లోన్ని పరిగణలోనికి తీసుకొని మీకు లోన్స్ అందచేస్తాయి . సాధారణంగా మీ ఆదాయంలో నలభై నుండి యాభై ఐదు శాతం మాత్రమే మీరు లోన్స్ వాయిదాలు కట్టడానికి అర్హత ఉంటుంది . ఎందుకంటే మీరు అంతకంటే ఎక్కువ మొత్తం లోన్స్ వాయిదాల కొరకు చెల్లిస్తే కుటుంబం గడవడం ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తారు . ఉదాహరణకు మీరు నెలకు రూ .30000 / - జీతం అందుకుంటుంటే మీరు గరిష్టంగా రూ .16500 లోన్స్ గురించి చెల్లించగలరు . మిగిలిన రూ .13500 మీ కుటుంబ అవసరాల కొరకు వాడుకొంటారు . ఒకవేళ మీరు ఇదివరకే కారు లోన్ కోసం రూ .7000 EMI చెల్లిస్తుంటే ఇక మీరు గరిష్టంగా హౌసింగ్ లోన్ కొరకు చెల్లించే గలిగే EMI మొత్తం రూ . 9500 దీని ఆధారంగా మీకు లోన్ ఇవ్వబడుతుంది . ఉదాహరణకు లక్ష రూపాయలకు నెలకు EMI రూ .1050 అనుకుంటే మీరు తొమ్మిది లక్షల రూపాయల వరకు లోన్ అందుకోగలరు . ఒకవేళ వడ్డీ కనుక ఎక్కువగా ఉంటే మీరు ఇంతకంటే తక్కువగానే అందుకోగలరు . అదేవిధంగా సాధరణంగా లోన్ తిరిగి చెల్లించటానికి కాల వ్యవధి ఇరవై సంవత్సరాలు లేదా మీ వయస్సు అరవై సంవత్సరాలు చేరే వరకు ఉంటుంది . మీ వయస్సు ఎక్కువ ఉండి కాల వ్యవధీ ఇరవై సంవత్సరాలు సరిపడా లేక పోయిన మీకు లోన్ తక్కువగానే రాగలదు .

మీరు హౌసింగ్ లోన్ తీసుకొనే సమయంలో ముందుగా గమనించ వలసినది వడ్డీ రేటు మరియు వడ్డీ లెక్కించే విధానం . సాధారణంగా బ్యాంకులు రెండు రకాల వడ్డీ విధానాలను అవలంభిస్తాయి . ఫిక్సుడ్ మరియు ప్లోటింగ్ వడ్డీ రేటు . ఫిక్సుడ్ వడ్డీ రేటులో మీ లోన్ కాల పరిమితి వరకు ఒకేరకమైన వడ్డీ రేటు ఉంటుంది . దీని వలన మీ లోన్ కాలపరిమితి వరకు మీరు చెల్లించాల్సిన EMI ఒకే విధంగా ఉంటుంది . ఒకవేళ బ్యాంక్ వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ కూడా మీ వడ్డీ రేటు స్థిరంగా ఉంటుంది . కాని ఇందులో ఒకవేళ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గినప్పటికీ ఆ సౌలభ్యం అందుకునే అవకాశం ఉండదు . ఇక్కడ ఒక్క విషయం కూడా చూడాలి . కొన్ని బ్యాంక్లు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేటు అని చెప్పినప్పటికీ కూడా మీ అగ్రిమెంట్ లో ఒక క్లాజు ఉండే అవకాశం కలదు . అదేమిటంటే వడ్డీ రేట్లలో అనుకోకుండా సంభవించే మార్పులకు అనుగుణంగా మీ వడ్డీరేట్లు సర్దుబాటు A to Z ఇన్వెస్ట్మెంట్ గైడ్  చేసే హక్కు బ్యాంకు కు కలదు అని ఉంటుంది . కాని ఎలాంటి మార్పులు అనేది మాత్రం ఉండదు . అంటే మీది ఫిక్సుడ్ వడ్డీ రేటు ఐనప్పటికీ కూడా వడ్డీ రేటు మార్చే అవకాశం ఉంది . ఒకవేళ మీ అగ్రిమెంట్ లో కాని ఇలాంటి క్లాజు ఉంటే లోన్ తీసుకొనే సమయంలోనే బ్యాంక్ వారిని సంప్రదించి ఆ క్లాజు తొలగించే ప్రయత్నం చేయండి . ఇక ఫ్లోటింగ్ రేటు ఐతే మాత్రం బ్యాంక్ వడ్డీ రేట్లకు అనుగుణంగా మీ లోన్ పై కూడా వడ్డీలో మార్పులు ఉంటాయి . వడ్డీ రేట్లు పెరిగితే దానికి అనుగుణంగా మీ EMI మొత్తం పెరగడం కాని లేదంటే మీ లోన్ కాల పరిమితిని పెంచడం కాని చేస్తారు . కొన్ని బ్యాంకులు రెండింటి కలయికలో అంటే కొంత మొత్తం లోన్ ఫిక్స్డ్ రేటు , మరికొంత లోన్ ఫ్లోటింగ్ రేటుపై కూడా అందిస్తున్నాయి . ఏది ఏమైనా మీకు నచ్చిన పద్ధతిలో వడ్డీ రేటు లెక్కించే బ్యాంక్ ఎన్నుకోవడం మంచిది . వడ్డీ రేటు తక్కువగా ఉంటే EMI కూడా తక్కువగా ఉంటుంది . వడ్డీ రేటు తక్కువగా ఉంటే మీకు వచ్చే లోన్ అమౌంట్ కూడా పెరుగుతుంది . కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి . ఫ్లోటింగ్ రేటు కంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేటు కొద్దిగా అధికంగానే ఉంటుంది . ఐతే మీరు ఏ వడ్డీ రేటు ఎంచుకున్న తక్కువ వడ్డీ రేటు ఉండే బ్యాంక్లను

సంప్రదించడం మంచిది . అదే విధంగా బ్యాంక్లు మీ లోన్ పై వడ్డీని రోజు వారిగా లెక్కిస్తున్నాయా లేక నెలవారిగా లెక్కిస్తున్నాయా తెలుసుకోండి . బ్యాంక్ లు మీరు తీసుకున్న లోన్ మొత్తం తీర్చడానికి కాలపరిమితి ఇరవై సంవత్సరాలలో తీర్చడానికి అనుమతిస్తాయి . కొన్ని బ్యాంకులు ఇరవై ఐదు సంవత్సరాల కాలపరిమితి వరకు కూడా అనుమతిస్తున్నాయి . కాలపరిమితి ఎక్కువగా ఉంటే మీరు పొందే లోన్ ఎక్కువగానూ మీరు చెల్లించే EMI తక్కువగానూ ఉంటుంది . మీరు లోన్ తీసుకోవడానికి ముందుగా మీ ఇంటి విలువలో 15 నుండి 20 % వరకు మీరు డౌన్ పేమెంట్గా చెల్లించాల్సి ఉంటుంది . ఇది మీరు ఏ కారణం చేతనైన మీ లోన్ చెల్లించలేని పక్షంలో బ్యాంక్ లకు ఎలాంటి నష్టం  రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది . అదే విధంగా బ్యాంక్లు ప్రాసెసింగ్గా కొంత చార్జీలు వసూలు చేస్తాయి . ఈ ఫీజు కూడా మీరు బ్యాంక్ వారితో సంప్రదించి తగ్గించుకొనే ప్రయత్నం చేయవచ్చు . అదేవిధంగా మీ బ్యాంక్ , మీ లోన్ ప్రాసెస్ ఎన్ని రోజులలో చేయగలదో తెలుసుకోండి . సాధారణంగా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కొంత ఎక్కువ సమయమే తీసుకుంటాయి . కొన్ని సమయాలలో మీకు అనుకోకుండా బోనస్ కాని మరో విధంగా కాని డబ్బూ చేతికి అందితే మీరు చెల్లించే EMI అమౌంట్ కంటే అధికంగా చెల్లిస్తే కొన్ని బ్యాంక్స్ మీ మీద ప్రీ పేమెంట్ చేసినందుకు కొంత పెనాల్టీ విధించవచ్చు . కొన్ని బ్యాంక్ లు మాత్రం మీ లోన్ మొత్తం లో కొంత శాతం వరకు మాత్రం ప్రీ పేమెంట్ చేస్తే ఎలాంటి చార్జీలు విధించడం లేదు . అదే విధంగా ఒకేసారి మీకు పెద్ద మొత్తం సొమ్ము చేతికి రావడంతో కాని లేదంటే ఇప్పుడు ఉన్న వడ్డీ రేటుకంటే తక్కువ వడ్డీ రేటుకు మీకు మరొక బ్యాంక్ లోన్ అందచేస్తుంటే మీరు , మీ లోన్ కాలపరిమితి కంటే ముందే చెల్లిస్తే బ్యాంకు చార్జీలు విధించే అవకాశం కూడా కలదు . కొన్ని బ్యాంక్లు మీ హౌసింగ్ లోన్ కొరకు గ్యారంటర్ కావాలి అని కోరే అవకాశం కూడా కలదు . ఒకవేళ మీరు గ్యారంటర్ నూ ఏర్పాటు చేసుకోలేక పోతే ఏ బ్యాంక్లు ఐతే గ్యారంటర్ నూ అడగటం లేదో ఆ బ్యాంక్ నూ సంప్రదించడం మంచిది . అదే విధంగా కొన్ని ఆ ఆ ఆఫర్స్ బ్యాంక్లు మీ లోన్ తో పాటు కొన్ని ఆఫర్స్ కూడా అందచేయవచ్చు . మీకు ఉపయోగపడే విధంగా ఉంటే మంచిది . గోల్డ్ కాయిన్ ఆఫర్ బదులు హోం ఇన్సూరెన్స్ ఆఫర్ మంచిది . మరికొన్ని బ్యాంకులు ఇంట్లో ఫర్నిచర్ మరియు ఇంటీరియల్ డెకరేషన్ కొరకు కూడా లోన్స్ అందిస్తాయి . మీరు పై విధంగా అన్ని రకాలుగా ఆలోచించుకొని మీకు అనుకూలంగా ఉన్న బ్యాంక్లో లోన్ తీసుకోవడం మంచిది . మీరు ఇంటి కొరకు ఋణం తీసుకొనే సమయంలో ఒకవేళ మీ శ్రీమతికి కూడా సంపాదన కాని ఉన్నట్టు ఐతే ఆమె ఆదాయాన్ని కూడా పరిగణలోకి A to Z ఇన్సెస్ట్మెంట్ గైడ్ తీసుకొంటారు . దీని వలన మీరు పొందే లోన్ అమౌంట్ కూడా పెరుగుతుంది . లోన్ అమౌంట్ ఎంత వచ్చినప్పటికి కూడా మీ ఇంటి విలువలో గరిష్టంగా 85 % మాత్రమే లోన్ వస్తుంది . అనే విషయం మాత్రం మీరు మర్చిపోవద్దు . ఇంటి విలువ మీరు మీ అప్లికేషన్ ఫాం లో చెప్పినట్లుగా బ్యాంక్ వారు గుడ్డిగా నమ్మరు . వారు వారి యొక్క వాల్యుర్ ద్వారా ఇంటి విలువ లెక్కగట్టి దానికి అనుగుణంగానే మీ లోన్ సాంక్షన్ చేయడం జరుగుతుంది . మీరు ఇంటి కోసం ఋణం తీసుకున్నప్పుడు మీ ఇంటికి మరియు మీకు తప్పకుండా ఇన్సురెన్స్ చేయించుకోవడం మర్చి పోవద్దు . బ్యాంక్ తను ఏ ఇంటి కొరతైతే లోన్ ఇచ్చినదో ఆ ఇంటికి ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వలన నష్టం జరిగితే ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఉపయోగపడుతుంది . అదేవిధంగా మీకు పర్సనల్ ఇన్సురెన్స్ ఉన్నట్లు ఐతే మీమరణానంతరం మీ వాళ్ళు లోన్ కట్టకపోయిన ఇన్సురెన్స్ ద్వారా వచ్చిన అమౌంట్ తో మీ లోన్ కట్టి మీ వాళ్ళ ఇల్లు సొంతం చేసుకోవచ్చు . మీరు ఇన్సురెన్స్ గురించి పూర్తీ వివరంగా ఇన్సురెన్స్ చాప్టర్ లో చదవవచ్చు . మీరు కనుక వరుసగా 3 నెలల వాయిదాల సక్రమంగా చెల్లించకపోతే బ్యాంక్ వారు మీ ఇంటిని స్వాధీనం చేసుకొనే హక్కు కలిగి ఉంటారు అనే విషయం మీరు మర్చిపోవద్దు .

Post a Comment

0 Comments

Close Menu