ఓ సారి క్రింద ఇచ్చిన పక్షుల పాద గుర్తులని గమనించండి
ఇవి 'X ఆకారంలా ఉంటాయి..
పూర్వ కవులు , ఏవైనా రచించేటప్పుడు ఛందస్సు కారణంగానో ఇంకేదైనా కారణంగానో వారికీ పదం స్ఫురించక పోతే వారు ఖాళీ ఉంచకుండా ఇలా X గుర్తు పెట్టేవారు . తరువాత వాటిని పూర్తి చేసేవారు. ఈ X గుర్తుని సరస్వతి దేవి వాహనమైన హంస పాద గుర్తని భావించేవారు .
అలాంటి ఖాళీలు రచన మధ్యలో ఉండడం సాధారణమే కానీ , మొదట్లోనే ( ఆదిలోనే ) పెట్టవలిసివస్తే దాన్ని " ఆది లోనే హంస పాదు " అంటారు .
ఏదైనా పని ప్రారంభించిన వెంటనే ఆటంకాలు ఎదురైతే , అదే "ఆది లోనే హంస పాదు " .
క్లుప్తంగా " starting trouble or teething problems"
మొదట్లోనే పొరపాటు అనే అర్థం లో ఆదిలోనే హంస పాదు అంటాము ..హంస పాదమే హంస పాదు..
హంసపాదం ఇంగ్లీష్ లో^ వై ^తిరగవేసిన ఆకారంలో ఉంటుంది.
ఏదైనా పదమో అక్షరమో వ్రాతలో మిస్ ఐతే దాన్ని ఈ గుర్తువేసి పై లైనులో ఆ పదమో అక్షరమో వ్రాస్తాము. అది ఎట్లైనా చూడడానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. ప్రామిసరీ నోట్లలో రిజిస్ట్రేషన్ పత్రాలలో ఇది తరచుగా కనిపిస్తుంది. డబ్బు పెట్టి కొని ఆ నోటు మీద వ్రాస్తారు గాబట్టి వేరే ఇంకో కాగితం లో వ్రాయాలంటే చాలా డబ్బు ఖర్చవుతుంది గాబట్టి ఆ విధంగా వ్రాసి ఆ పేజీ చివరలో ఏ పంక్తి లో దిద్దుబాటున్నదీ వ్రాస్తారు. సరిపోతుంది.. పొరపాటు రాకుండా వ్రాయడం జరిగితే ఏ గిలీ లేకుండా ఉంటుంది గదా!
ఏ పనిలోనైనా మొదట్లోనే తప్పటడుగులు వేస్తే ఆదిలోనే హంసపాదా?—అని అసంతృప్తి వ్యక్తం చేస్తారు.
0 Comments