ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉన్నారు. ఇది నమ్మశక్యంగా లేకపోవచ్చు కానీ ఒక్కోసారి నిజమే అనిపిస్తుంది. మరియు ఆ కారణంగా, కొన్నిసార్లు మనం నిజమైన వ్యక్తిని గుర్తించడంలో తప్పుగా ఉంటాము. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి, సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్ వంటి ప్రముఖ సెలబ్రిటీల తరహాలో కనిపించే వారి వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వచ్చి బాగా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలోని వ్యక్తి దేశంలోనే అతిపెద్ద నాయకుడు నరేంద్ర మోదీలా కనిపిస్తున్నాడని నెటిజన్లు నమ్ముతున్నారు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి మోడీలా పానీపూరీ అమ్ముతున్నాడని, ఫోజు ఇస్తున్నాడని వ్యాఖ్యానిస్తున్నారు.
ఆ వ్యక్తి మన దేశ ప్రధాని నరేంద్ర మోదీలా కనిపిస్తున్నాడని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తుండగా.. మరికొందరు మాత్రం అలాంటి పోలికలు లేవంటున్నారు. అయితే దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి కూడా గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారే. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా వల్లభ్ విద్యానగర్‌కు చెందిన అనిల్ భాయ్ ఠక్కర్ 'అతను టీ అమ్ముతాడు.. నేను పానీపూరీ అమ్ముతాను' అని సరదాగా చెప్పాడు. ఇక eatinvadodara
అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా షేర్ చేసిన ఈ వీడియోలో ఠక్కర్ షాప్‌లో ఎన్నో రకాల పూరీలను చూడవచ్చు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 6 లక్షల 11 వేలకు పైగా లైక్‌లు, 82 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. ప్రస్తుతం అతడి పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది ఈ పిక్‌ని కూడా షేర్ చేస్తున్నారు.

0 Comments