ఒకొక్కసారి మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అకస్మాత్తుగా అయిపోతుంది.వంట చేసేటప్పుడు మధ్యలో ఆగిపోతుంది. రెండు నెలలు రావాల్సిన సిలిండర్ ఒక్క నెలకే అయిపోతుంది..
. అలాంటి సందర్భాలలో గృహిణులు ఆందోళన చెందుతారు. అలాగే, గ్యాస్ సిలిండర్ లేనప్పుడు చాలా ఒత్తిడి ఉంటుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? గ్యాస్ ఎన్ని రోజులకు వస్తుందో ముందుగానే తెలుసుకోవడం ఎలా? గ్యాస్ ఎంత ఉందో ముందుగానే ఎలా తెలుసుకోవాలి? 14.2కిలోలు అనే నంబర్ గల గ్యాస్ సిలిండర్ నుండి మనకు ఎంత గ్యాస్ లభిస్తుందో తెలుసుకోవడానికి ఒక టెక్నిక్ ఉంది.గ్యాస్ సిలిండర్‌లో ఇంకా ఎంత గ్యాస్ ఉందో ఒక సాధారణ ట్రిక్‌తో ఎటువంటి ఖర్చు లేకుండా తెలుసుకోండి..
సిలిండర్ పైన14.2 కిలోల గ్యాస్ ఉంటుంది. అది ఎప్పుడు అయిపోతుందో
మీకు తెలియదు. గ్యాస్ బండను ఉపయోగించినప్పుడు, బండపై చల్లటి నీటిని పోసి, అందులో ఎక్కువ గ్యాస్ లేదేమో చూడటానికి రెండు నిమిషాలు వేచి ఉండాలి. రెండు నిమిషాల తర్వాత చూస్తే గ్యాస్ ఉన్నచోట తడిగా ఉంటుంది
అర్థమవుతుంది. గ్యాస్ లేని చోట పొడిగా ఉంటుంది. అంటే తేమ ఆరిపోయిన భాగం వరకు
గ్యాస్ అయిపోయిందని మనం సులభంగా తెలుసుకోవచ్చు. అదనంగా, మీరు తడిగా ఉన్నంత వరకు గ్యాస్ ఉందో లేదో కూడా చెప్పవచ్చు. దీని ఆధారంగా గ్యాస్ ఎంతకాలం వస్తుందో సులభంగా తెలుసుకోవచ్చు. మరికొన్ని మార్గాల ద్వారా దీనిని కూడా కనుగొనవచ్చు.
గ్యాస్ మొత్తాన్ని గుర్తించడానికి రెగ్యులేటర్ కు మీటర్ల కూడా వస్తున్నాయి. మీటర్ ద్వారా , ఎంత గ్యాస్ ఉందొ మీకు తెలుస్తుంది..
ఇటువంటి పద్ధతులతో గ్యాస్ కొరతను నివారించవచ్చు.
0 Comments