Ad Code

Responsive Advertisement

ఏంటి బయాటిక్స్ అంటే ఏమిటి?

 



ఏంటి బయాటిక్స్ అన్నవి కొన్ని ప్రత్యేక ఔషధములు. ఇవి మన శరీరంలో రోగాలను పుట్టించే విష కీటాణువులను నాశనం చేస్తాయి. వ్యాధులతో పోరాడటానికి మన శరీరానికి ఇవి సహాయాన్ని చేకూరుస్తాయి. ఇటీవల కాలంలో అనేక వ్యాధులను నయం చేయటానికి వీటిని ఔషధ రూపంలో ఉపయోగిస్తున్నారు

ఏంటి బయాసిస్' అనే పదం నుండి 'ఏంటి బయాటిక్స్' పేరు వచ్చింది. 1880 లో ఒక సజీవ ప్రాణి ద్వారా మరొక సజీవప్రాణిని నశింపచేయటమనే అర్థంలో దీనిని వాడేవారు. కాని నేడు దీని అర్థం మారింది. సూక్ష్మజీవుల శరీరాల నుంచి తీసిన రసాయనిక పదార్థముల ద్వారా ఇతర సూక్ష్మ జీవులను నశింపచేయటం మొట్టమొదటిసారిగా క్రీ.శ. 1942 లో 'ఏంటి బయాటిక్స్' శబ్దం ప్రయోగింపబడింది. తొట్టతొలుత తయారయిన ఏంటి బయాటిక్ ఔషధం- పెన్సిలిన్. ఇది న్యుమోనియా, దగ్గు,గొంతు వాపు, కురుపులు వ్రణములు మొదలైన వాటికి వైద్యంగా బాగా పనిచేసింది.

సెప్టోమైసిన్– రెండవ ఔషధం దీనిని ఉష్ణ జ్వరాలకు వాడతారు. ఇంకా ఎంపిసిలిన్, టెట్రాసైకిలీస్, క్లోరోమైసిటిన్ మొదలయిన అనేక ఏంటి బయాటిక్ ఔషధములు అనేక రోగములను నశింపచేయటంలో బాగా ఉపయోగపడుతున్నాయి. వీటిని ఇంజక్షను ద్వారా, లేదా కాప్సుల్ (గొట్టం) ద్వారా శరీరంలోకి ప్రవేశింపచేస్తారు. ఇవి లోపల వున్న వ్యాధిని వ్యాపింపచేసే రోగక్రిములను చంపి రోగ నివారణ చేస్తాయి.

ఈ ఏంటి బయాటిక్స్ దేనితో తయారు చేస్తారో మీకు తెలుసా ? ఎక్కువ భాగం ఏంటి బయాటెక్స్ ను జీవాణువులతో తయారు చేస్తారు. నిజానికి ఇవి రోగక్రిములను ఏ విధంగా నాశనం చేస్తాయో శాస్త్రజ్ఞులకు అంతుపట్టలేదు.

కొందరి అభిప్రాయం లొ ఇవి రోగి శరీరంలో ప్రవేశించిన పిదప ప్రాణవాయువు (ఆక్సిజన్)ను విషక్రిముల వరకు వెళ్ళకుండా ఆపుచేస్తాయి. అప్పుడు రోగక్రిములు ప్రాణవాయువు లేక చనిపోతాయి.

మరికొందరి శాస్త్రజ్ఞుల అభిప్రాయం లో రోగక్రిములను శరీరం నుంచి ఆహారాన్ని తీసుకోకుండా ఎంటి బయాటిక్స్ ఆపుతాయి. తద్వారా రోగక్రిములు చస్తాయి అని అంటారు.

ఏంటి బయాటిక్స్ పనిచేసే పద్ధతి ఏమయినప్పటికి అవి మాత్రం అనేక రోగాలను మానవుల నుంచి దూరం చేయటంలో ఉపయోగకరమని ఋజువయింది. వీటివలన ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది రోగ విముక్తులవుతున్నారు. ఇప్పుడు ఏంటి బయాటిక్స్ విలువ బాగా పెరిగింది. 1930లో అమెరికాలో న్యుమోనియా వలన మరణించేవారి సంఖ్య 20 నుండి 85 ఉండగా 1960 లో ఈ సంఖ్య 5 గా తగ్గిపోయింది. ఇదే విధంగా టైఫాయిడు' వలన మరణించేవారి సంఖ్య 10 నుంచి తగ్గి 2 అయ్యింది. వీటివలన అంటువ్యాధులను కూడా అరికట్టవచ్చును. ఏంటి బయాటిక్స్ వలన శరీరం పై దుష్ప్రభావం కూడా కలుగవచ్చు. నాలుకపై పుండ్లు పడవచ్చు. మోతాదు ఎక్కువయినట్లయితే మరణం కూడ సంభవించవచ్చు.


Post a Comment

0 Comments

Close Menu